
‘ప్రజా తీర్పును శిరసావహిస్తాను’...ఇది తాజాగా వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. కౌంటిగ్ కేంద్రం వద్ద మీడియాతో శిల్పా మాటలు చూస్తే ఓటమికి మానసికంగా సిద్ధపడినట్లున్నారు. అప్పటి వరకూ ఉన్న ట్రెండును చూస్తే టిడిపి మెజారిటీ 17 వేల చిల్లరను తగ్గించటం కష్టమన్నారు. ఏదేమైనా ప్రజల నిర్ణయమే అంతిమమని వేదాంత ధోరణిలో చెప్పటం గమనార్హం. మొత్తం 19 రౌండ్ల కౌటింగ్ లో శిల్పా మాట్లాడేటప్పటికి అయ్యింది 9 రౌండ్లే. అంటే, ఇంకా 10 రౌండ్లు మిగిలి వుండగానే శిల్పా ఓటమిని అంగీకరించినట్లుగా ప్రకటించటం ఆశ్చర్యంగా ఉంది.