వైపీపి అభ్య‌ర్థి ఓట‌మీ ఖాయం

Published : Aug 17, 2017, 03:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
వైపీపి అభ్య‌ర్థి ఓట‌మీ ఖాయం

సారాంశం

వైసీపి ఎన్నికల్లో ఓటమీ ఖాయమన్న ఎమ్మెల్యే అనితా కారణం రోజా అని ఎద్దేవా. రోజా ఐరేన్ లెగ్ అని ఆమె ఎద్దేవా.

రోజా పై టీడీపీ ఎమ్మెల్యే అనిత నిప్పులు చెరిగారు. రోజా కారణంగానే నంద్యాలలో వైసీపీ అభ్యర్థి ఒడిపోతారని ఆమె విమ‌ర్శించారు. రోజా ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీకి ఓటమి త‌ప్ప‌ద‌ని ఎద్దేవా చేశారు. గురువారం ఆమె మీడియా స‌మావేశంలో మాట్లాడుతు రోజా పై విరుచుకుప‌డ్డారు

 

రోజాకు వైసీపి నాయ‌కులు స్క్రిప్ట్ రాసిస్తుంటే ప్ర‌చారంలో చ‌దువుతుంద‌ని ఎద్దేవా చేశారు అనిత‌. ఆమెకు రాజకీయాల మీద ఏ మాత్రం అవ‌గాహాన లేద‌ని ఆరోపించారు. రోజా ఐరన్ లెగ్ అని అందరికీ తెలిసిన విషయమేనని అనిత వ్యంగ్యంగా అన్నారు. ఓ మ‌హిళ అయి ఉండి మ‌రో మ‌హిళ డ్రెస్ గురించి మాట్లాడ‌టం త‌గ‌ద‌ని ఆమె సూచించారు. రోజా మాట్లాడుతున్న భాష మహిళ లోకం తలదించుకునే విధంగా ఉందని ఆమె ఆరోపించారు. వైసీపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహాన్ రెడ్డి మీద కూడా ఆమె ధ్వ‌జ‌మెత్తారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్