మైనార్టీ ఓట్లు ప‌డ‌వ‌ని మ‌మ్మ‌ల్ని రానివ్వ‌డం లేదు

Published : Aug 17, 2017, 02:16 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
మైనార్టీ ఓట్లు ప‌డ‌వ‌ని మ‌మ్మ‌ల్ని రానివ్వ‌డం లేదు

సారాంశం

నంద్యాల ఉప ఎన్నికలో తమని ప్రచారానికి దూరం పెట్టారని బీజేపి నాయకుల ఆందోళన. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పొత్తు ఉన్న తమని ప్రచారానికి ఆహ్వానించడం  లేదన్నారు. ఇప్పుడు పిలిచిన ప్రచారానికి సిద్దమన్నారు బీజేపి నాయకులు.

 నంద్యాల ఉప ఎన్నికల్లో ముస్లిం వర్గాల ఓట్లు పడవనే భయంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు త‌మ‌ని ప్రచారానికి పిలువలేదని వాపొతున్నారు కర్నూల్ బీజేపీ నాయకులు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలేక‌ర్ల‌ సమావేశంలో బీజేపి నాయ‌కులు మాట్లాడారు. తమ ప్ర‌చారంతో నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి క‌లిసి వ‌స్తుంద‌నుకున్నాము కానీ చివ‌ర‌కు తమని టీడీపీ దూరం పెట్టార‌ని వాపోయారు జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య.


 నంద్యాలలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారని, అందుకే త‌మ‌ని ప్రచారానికి పిలిస్తే మైనార్టీలు ఓట్లు వేయరనే భయంతోనే టీడీపీ ప్ర‌చారానికి పిల‌వ‌డం లేద‌న్నారు. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉన్నా బీజేపీ నాయకులను ఉప ఎన్నికలకు ఎంద‌కు పిలవడం లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. గతంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో బీజేపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రచారం చేశాయని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల్లో బీజేపీని పక్కన పెట్టడ‌టం స‌రికాద‌ని వారు పెర్కొన్నారు. 

టీడీపీ నాయ‌కులు ఉప ఎన్నిక ప్రచారానికి త‌మ‌ని ఆహ్వానిస్తే ఇప్పటికైనా అక్కడికి వెళ్లి ప్ర‌చారానికి సిద్దమని వారు తెలిపారు. బీజేపీ, టీడీపీ మధ్య కేంద్ర‌, రాష్ట్ర స్థాయిల‌ల్లో పొత్తు ఉందని తెలిపారు. అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని ఈ సంధ‌ర్భంగా బీజేపి నాయ‌కులు పెర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్