టీడీపీలోకి యార్లగడ్డ: చంద్రబాబుతో వెంకటరావు భేటీ

By narsimha lodeFirst Published Aug 20, 2023, 1:20 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుతో  యార్లగడ్డ వెంకటరావు ఇవాళ హైద్రాబాద్ లో భేటీ అయ్యారు. 


హైదరాబాద్:  టీడీపీ చీఫ్ చంద్రబాబుతో  యార్లగడ్డ వెంకటరావు  ఆదివారంనాడు భేటీ అయ్యారు. ఇవాళ హైద్రాబాద్ లో యార్లగడ్డ వెంకటరావు  చంద్రబాబుతో సమావేశమయ్యారు.ఈ నెల  18వ తేదీన  విజయవాడలో తన అనుచరులతో  యార్లగడ్డ వెంకటరావు భేటీ అయ్యారు. ఈ భేటీలో   మీడియా వేదికగా  అపాయింట్ మెంట్ ఇవ్వాలని చంద్రబాబును  యార్లగడ్డ వెంకటరావు కోరారు.  దీంతో  ఇవాళ చంద్రబాబు యార్లగడ్డ వెంకటరావుకు అపాయింట్ మెంట్ ఇచ్చారు.చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత  యార్లగడ్డ వెంకటరావు మీడియాతో మాట్లాడారు త్వరలోనే టీడీపీలో చేరుతానని  ఆయన చెప్పారు. పార్టీ ఎక్కడి నుండి పోటీ చేయమన్న పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా  యార్లగడ్డ వెంకటరావు  ప్రకటించారు. 

పార్టీ చెబితే గుడివాడ నుండి కూడ పోటీ చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. రాజకీయాల్లోకి డబ్బు కోసం రాలేదన్నారు. రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చానని ఆయన  వివరించారు. రాజకీయాల కోసం అమెరికా వదిలి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు దార్శనికుడని ఆయన  కొనియాడారు  .

2019  అసెంబ్లీ ఎన్నికల్లో గవ్నవరం అసెంబ్లీ స్థానం నుండి యార్లగడ్డ వెంకటరావు  వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. యార్లగడ్డ వెంకటరావుపై పోటీ చేసి విజయం సాధించిన  టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ  వైసీపీకి జై కొట్టారు. దీంతో  గన్నవరంలో  వల్లభనేని వంశీ,  యార్లగడ్డ వెంకటరావు వర్గాల మధ్య పోసగడం లేదు. గన్నవరం  రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని  యార్లగడ్డ వెంకటరావుకు  పార్టీ నాయకత్వం సూచించింది.  అయితే తన వర్గీయులపై  వల్లభనేని వంశీ కేసులు పెట్టిస్తున్నా కూడ  పార్టీ నాయకత్వం  పట్టించుకోవడం లేదని గతంలో యార్లగడ్డ వెంకటరావు  వైసీపీపై అసంతృప్తిని వ్యక్తం  చేశారు.ఈ విషయమై రెండు వర్గాల  మద్య రాజీకి  పార్టీ నాయకత్వం ప్రయత్నించింది.  

also read:గన్నవరం రాజకీయం : ప్రత్యర్థులు వాళ్లే, కానీ పార్టీలే వేరు

కొంతకాలం పాటు  గన్నవరం రాజకీయాలకు  యార్లగడ్డ వెంకటరావు దూరంగా ఉన్నారు. రెండు వారాల క్రితం  దుట్టా రామచంద్రరావుతో  యార్లగడ్డ వెంకటరావు భేటీ అయ్యారు. ఆ తర్వాత వారం రోజులకే  తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు.  వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి తనకు  టిక్కెట్టు ఇవ్వాలని  ఆయన  కోరారు. అయితే వైసీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు  తనకు  బాధ కల్గించినట్టుగా యార్లగడ్డ వెంకటరావు ప్రకటించారు. ఈ తరుణంలో  ఈ నెల  18న  అనుచరులతో భేటీ అయ్యారు యార్లగడ్డ వెంకటరావు.  ఈ సమావేశంలోనే చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరారు. యార్లగడ్డ వెంకటరావు  వినతి మేరకు  చంద్రబాబు ఆయనకు ఇవాళ అపాయింట్ మెంట్ ఇచ్చారు.  గన్నవరం  రాజకీయాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని సమాచారం.

 

.


 

click me!