సీబీఐ విచారణకు హైకోర్టు ఆర్డర్: అజ్ఞాతంలోకి యరపతినేని

Google News Follow Us

సారాంశం

యరపతినేని శ్రీనివాసరావు అజ్ఞాతంలోకి వెళ్లాడు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడు

గుంటూరు:గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ విచారణకు కూడ హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో యరపతినేని అజ్ఞాతంలోకి  వెళ్లినట్టుగా సమాచారం,

గురజాల నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ నిర్వహించాడని మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై కేసు నమోదైంది. అక్రమంగా మైనింగ్ చేశాడని సీఐడీ నివేదిక ఆధారంగా  తేలిందని  హైకోర్టు వ్యాఖ్యలు  చేసింది.

అక్రమ మైనింగ్ వ్యవహరంలో  సీబీఐ విచారణకు ఈ నెల 26 వతేదీన హైకోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో యరపతినేని శ్రీనివాసరావు  అజ్ఞాతంలోకి వెళ్లాడు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ సీబీఐ విచారణకు అనుమతిస్తే ఏం చేయాలనే దానిపై ఆయన చర్చిస్తున్నట్టుగా చెబుతున్నారు.

హైకోర్టు తీర్పు పూర్తి పాఠం వచ్చిన తర్వాత ఈ విషయమై ఏం చేయాలనే దానిపై సీఎం జగన్  నిర్ణయం తీసుకొంటారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే యరపతినేని శ్రీనివాస రావు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు.

సంబంధిత వార్తలు

యరపతినేనిపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి

అక్రమమైనింగ్ కేసులో టీడీపీ నేత యరపతినేనిపై కేసు