బీజేపీ టార్గెట్.. ‘‘వన్ నేషన్... వన్ రిలీజియన్’’ : యనమల

By sivanagaprasad kodatiFirst Published Nov 1, 2018, 9:53 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఢోకా లేదన్నారు ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని.. దీనిలో భాగంగా ఎవరు ఎవరితో కలుస్తున్నారన్నది ముఖ్యం కాదని అభిప్రాయపడ్డారు

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఢోకా లేదన్నారు ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని.. దీనిలో భాగంగా ఎవరు ఎవరితో కలుస్తున్నారన్నది ముఖ్యం కాదని అభిప్రాయపడ్డారు.

బీజేపీ ప్రజాస్వామ్యాన్ని విలువలను ఖూనీ చేస్తోందని.. రాజ్యాంగ విలువలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘‘ వన్ నేషన్... వన్ రిలీజియన్’’ లక్ష్యంగా పావులు కదిపిందని యనమల ఆరోపించారు.

వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని.. దేశాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా వుంటే వారిని హింసిస్తున్నారన్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాకా టీడీపీని టార్గెట్ చేశారని.. దేశంలో బీజేపీయేతర పార్టీలను వేధించడం మొదలుపెట్టారని మండిపడ్డారు.

బ్రిటీష్ హయాంలో పార్టీలకతీతంగా అంతా ఒక్కటయ్యారన్నారని.. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అంతా ఒక్కటవుతున్నారని యనమల స్పష్టం చేశారు. దేశాన్ని రక్షించుకోవడం కోసం బీజేపీయేతర పక్షాల కలయిక అని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు..

‘‘సేవ్ నేషన్’’ నినాదంతో చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారన్నారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీకి రూ.3000 కోట్లు ఖర్చు పెట్టారని.. కానీ న్యాయమైన ఏపీ కోరికలు మాత్రం బీజేపీ నెరవేర్చలేదని.. ఇష్టానుసారం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం బీజేపీ అందరికీ ఉమ్మడి శత్రువుగా మారిందని.. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని రమేశ్ పేర్కొన్నారు. 

రాహుల్ గాంధీని కలుస్తా,జాతీయ పార్టీలను ఏకం చేస్తా:చంద్రబాబు

థర్డ్ పార్టీ విచారణకు శరద్ పవార్, శరద్ యాదవ్ ల మద్దతు

జాతీయ స్థాయిలో పోటీకి చంద్రబాబు ప్లాన్

అఖిలేష్, మమతా ఫోన్: చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ దూకుడు

ఏపీలో ఇంకా దాడులు జరుగుతాయ్: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

click me!