జగన్ సైకో....ట

Published : Mar 24, 2017, 11:47 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
జగన్ సైకో....ట

సారాంశం

పెద్ద నోట్ల రద్దు వల్ల జగన్ మానసికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి సైకోలాగ తయారయ్యారా? అవునని యనమల రామకృష్ణుడు సర్టిఫికేట్ ఇచ్చేసారు. సభలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు ప్రభావం జగన్ పై తీవ్రంగా పడిందన్నారు.  తండ్రి అదికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డుగోలుగా జగన్ సంపాదించినట్లు ఆరోపించారు. ఆత్రంతో బెంగుళూరులో భారీ భవంతిని కూడా నిర్మించుకున్నట్లు కూడా మంత్రి ఎకసక్కాలాడటం గమనార్హం.

అయితే, తర్వాత జైలుకు వెళ్లిన జగన్ జైల్లో ఉన్నన్ని రోజులు కూడా భవంతిలో లేరని ఎద్దేవా చేసారు. అదే సమయంలో పెద్ద నోట్ల రద్దు వల్ల జగన్ మానసికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. దాచుకున్న నోట్లన్నీ చెల్లకుండాపోయిందన్న బాధ జగన్లో కనిపిస్తోందన్నారు. అందుకే జగన్ సైకోలా తయారైనట్లు యనమల తనదైన భాష్యం చెప్పారు. జగన్ మాట్లాడేటపుడు పదే పదే మైక్ కట్ చేసే స్పీకర్ యనమలకు మాత్రం యధేచ్చగా జగన్ను వ్యక్తిగతంగా విమర్శించే అవకాశాలివ్వటం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?