వై.ఎస్.షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు: జగన్‌పై డైరెక్ట్ ఫైట్

By narsimha lodeFirst Published Jan 17, 2024, 10:31 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టడంతో  సోదరుడు జగన్ పై  నేరుగా  షర్మిల పోరుకు సిద్దమని తేటతెల్లమైందని రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు వై.ఎస్. షర్మిలకు అప్పగించింది ఆ పార్టీ నాయకత్వం.  దీంతో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో  ఆయన సోదరి  వై.ఎస్. షర్మిల  రాజకీయంగా  తలపడనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీతో విబేధించి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్‌ఆర్‌సీపీ) పార్టీని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు.  2019లో  జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని  వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చింది.  

Latest Videos

2019 నుండి  ఇప్పటివరకు  అనేక రాజకీయ పరిణామాలు మారాయి. దీంతో  వై.ఎస్. షర్మిల  తాను స్వంతంగా ఏర్పాటు చేసుకున్న వైఎస్ఆర్‌టీపీని  కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.ఈ నెల 4వ తేదీన  కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. షర్మిల చేరారు.

వై.ఎస్. షర్మిలకు  కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఆ పార్టీ కట్టబెట్టింది. దీంతో  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో  వై.ఎస్. షర్మిల రాజకీయంగా ఢీ కొట్టనున్నారని  రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. 

also read:భారత్‌లో ఏటా రూ. 70 లక్షల సంపాదన: ఏడు వృత్తులు ఇవే....

కాంగ్రెస్ ఓటు బ్యాంకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లింది. ఈ ఓటు బ్యాంకును  తమ వైపునకు తిప్పుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ  పనిచేస్తుంది. వై.ఎస్. షర్మిల  కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో  వైఎస్ఆర్‌సీపీ వైపు వెళ్లిన ఓటు బ్యాంకును  తమ వైపునకు తిప్పుకొనేందుకు  మార్గం సులభమైందనే అభిప్రాయంతో  ఆ పార్టీ నాయకత్వం ఉంది. వైఎస్ఆర్‌సీపీ  అసంతృప్తులపై  కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ పెట్టిందనే  ప్రచారం కూడ లేకపోలేదు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి కాంగ్రెస్ లో చేరుతానని ప్రకటించారు. కాపు రామచంద్రారెడ్డి కూడ కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్టుగా ప్రచారంలో ఉంది.

also read:వై.ఎస్. షర్మిలకు పగ్గాలు: కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చేనా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  కనీసం  10 నుండి  15 శాతం ఓట్లు రాబట్టుకోవాలనే లక్ష్యంతో  కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా  మెరుగైన ఓట్లను రాబట్టుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది.  ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెరమీదికి కాంగ్రెస్ తెచ్చే అవకాశం లేకపోలేదు.

also read:వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు: నాడు తండ్రి, నేడు తనయ

 ప్రత్యేక హోదా ఇస్తామని  2014లో యూపీఏ హామీ ఇచ్చింది.  ఈ అంశం ఎన్నికల ప్రచారంలో ఇచ్చే అవకాశం ఉంది.  2019లో  వైఎస్ఆర్‌సీపీ ఈ అంశాన్ని  ప్రస్తావించింది. కానీ, తెలుగు దేశం, వైఎస్ఆర్‌సీపీలు  ప్రత్యేక హోదా అంశంపై ఎలా వ్యవహరించాయనే విషయమై  కాంగ్రెస్  ప్రచార అస్త్రంగా మార్చుకొనే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉమ్మడి కడప జిల్లా నుండి  వై.ఎస్. షర్మిల పోటీ చేసే అవకాశం కూడ ఉందనే ప్రచారం సాగుతుంది. ఒకవేళ అదే జరిగితే  వైఎస్ఆర్‌సీపీపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్‌సీపీ ఓట్లనే చీల్చుతుందా? ప్రభుత్వ వ్యతిరేక  ఓటు బ్యాంకును కూడ చీల్చుతుందా అనే చర్చ కూడ లేకపోలేదు. ఏ మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును కాంగ్రెస్ చీల్చనుందనే విషయమై చర్చ కూడ సాగుతుంది.   ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును  కాంగ్రెస్ చీల్చితే పరోక్షంగా  వైఎస్ఆర్‌సీపీకి లాభం కలుగుతుందని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

click me!