‘‘ వాళ్ల మధ్యలో నువ్వా.. చివరికి నీ బతుకు ’’: కేశినేని నానిపై బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jan 16, 2024, 08:08 PM ISTUpdated : Jan 16, 2024, 08:13 PM IST
‘‘ వాళ్ల మధ్యలో నువ్వా.. చివరికి నీ బతుకు ’’: కేశినేని నానిపై బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరోసారి ఫైర్ అయ్యారు. విజయవాడ స్వరాజ్య మైదాన్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించేందుకు మంగళవారం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుల వెంట కేశినేని వచ్చారు. ఈ ఘటనను టార్గెట్ చేస్తూ వెంకన్న ఓ ట్వీట్‌లో ఘాటు విమర్శలు చేశారు. 

‘‘ అయ్యా కేశినేని నాని ఒకప్పుడు నన్ను ఉద్దేశించి ఇప్పటివరకు చంద్రబాబు కాళ్ళు రేపటి నుంచి విజయ్  సాయి రెడ్డి కాళ్ళు అని ట్వీట్ చేశావ్..  విజయ్ సాయి రెడ్డి మీద, వైసీపీ మీద పోరాడేది నేనో నువ్వో ప్రజలకు తెలుసని ట్వీట్ చేశా.. ఇప్పుడు ప్రజలకు అర్దం అయింది.. ఎవరెంటి అని... టీడీపీలో ఒక వెలుగు వెలిగిన నువ్వు కోవర్ట్ గా పని చేసిన వెళ్ళంపల్లి ఓ పక్క మా బాస్ మీద ఎప్పుడు విషం కక్కే సాయి రెడ్డికి మధ్యలో  నిన్ను చూస్తుంటే ఇంత బతుకు బతికి ఇంటేనక సచ్చినట్టు ఉంది నీ బతుకు ’’ అంటూ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. 

కాగా.. విజయవాడ ఎంపీ కేశినేని నాని గత బుధవారం తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన  రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేసిన ఆయన.. ఆమోదించాల్సిందిగా కోరారు. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా నాని రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. రాజీనామా లేఖను మెయిల్ ద్వారా పంపడంతో పాటు సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు. 
 
PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఒకే వేదికపై ఇద్దరు సీఎంలు | Chief Ministers Chandrababu Vijay Joseph meeting at Vijayawada | Asianet
ఏపీ సీఎం చంద్ర‌బాబుతో త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ భేటీ.. ఏం చ‌ర్చించారంటే.?