సుప్రింకోర్టు వ్యాఖ్యలు ఏపికీ వర్తిస్తాయా ?

First Published Sep 22, 2017, 2:53 PM IST
Highlights
  • తెలంగాణా ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏపిలోని ఫిరాయింపు ఎంఎల్ఏలకూ వర్తిస్తాయా?
  • తెలంగాణాలో ఫిరాయింపులను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎంఎల్ఏ సంపత్ సుప్రింకోర్టులో కేసు వేసారు. దానిపై శుక్రవారం విచారణ జరిగింది.

తెలంగాణా ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏపిలోని ఫిరాయింపు ఎంఎల్ఏలకూ వర్తిస్తాయా? ఇపుడదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. తెలంగాణాలో ఫిరాయింపులను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎంఎల్ఏ సంపత్ సుప్రింకోర్టులో కేసు వేసారు. దానిపై శుక్రవారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా జడ్జి మాట్లాడుతూ, ‘‘ఈ కేసులో ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని, కాబట్టి అక్టోబర్ లోగా ప్రత్యేకించి ఓ ధర్మాసనం ఏర్పాటు చేసి విచారణ జరుపుతామం’’టూ హామీ ఇచ్చారు పిటీషనర్ కు. ప్రత్యే దర్మాసనమంటే కేసును త్వరగా పూర్తి చేయాలన్న యోచనలో కోర్టు ఉన్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణాలో ఇపుడదే హాట్ టాపిక్ అయిపోయింది.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే తెలంగాణాలో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలే ఏపికి కూడా వర్తిస్తుందా అన్న విషయంలో చర్చ మొదలైంది. ఎందుకంటే, ఏపిలో కూడా చంద్రబాబునాయుడు 21 మంది వైసీపీ ఎంఎల్ఏలకు ప్రలోభాలు పెట్టి లాక్కున్నారు. పైగా నిసిగ్గుగా తన చర్యలను సమర్ధించుకుంటూ వారిలో నలుగురికి మంత్రిపదవులను కూడా కట్టబెట్టారు. అయితే, అప్పటికే ఈ విషయమై వైసీపీ కోర్టులో కేసు కూడా వేసింది. ముందు హై కోర్టు తర్వాత సుప్రింకోర్టులో పిటీషన్ వేసింది. సరే, ఆ పిటీషన్ ఏమైందో ఎవరికీ గుర్తుకూడా లేదు. తెలంగాణాలో ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో సుప్రింకోర్టు స్పందించిన తీరులోనే ఏపిలో కూడా స్పందిస్తుందా అన్నది చూడాలి.

click me!