కనకదుర్గ అమ్మవారి నగలు చూశారా?

Published : Sep 22, 2017, 01:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
కనకదుర్గ అమ్మవారి నగలు చూశారా?

సారాంశం

రోజుకో రూపంలో దర్శనమివ్వనున్న దుర్గా మాత వివిధ రకాల నగలతో దేవీప్యమానంగా వెలుగుతున్న అమ్మవారు

ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారు.. తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తారు. మొదటి రోజు స్వర్ణ కవచాలాంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. రెండో రోజైన శుక్రవారం బాలా త్రిపుర సుందరిగా కనువిందు చేశారు.

ఈ తొమ్మిది రోజులు.. కనకదుర్గ అమ్మవారు.. రోజుకో రూపంలో.. వివిధ రకాల నగలను ధరించి భక్తులకు కనిపిస్తారు.  ఒక్కో రూపానికి తగిన విధంగా వివిధ రకాల నగలను అమ్మవారికి చేయించారు. వాటిలో ముఖ్యంగా కాసులపేరు,ఆకుల హారం, పచ్చల హారం, కిరీటాలు, బంగారు పాదాలు, బంగారు జడ, నల్ల పూసలు, తాళిబొట్టు, వడ్డాణం, పాపిడిబిల్లలు, అరవంకీలు, ముక్కుపుడకలు లాంటివి ఉన్నాయి. వీటిని ధరించిన అమ్మవారు.. దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. అమ్మవారితోపాటు.. ఆమె ధరించిన నగలు  కూడా ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

Weather Alert: ఆరేబియా సముద్రం వైపు అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావ‌ర‌ణం ఎలా ఉండ‌నుందంటే
Republic Day Celebrations 2026: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పీచ్ | Asianet Telugu