ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ అసభ్యపదజాలంతో దూషిస్తూ.. వేధిస్తున్నారు...

Published : Sep 16, 2022, 09:09 AM IST
ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ అసభ్యపదజాలంతో దూషిస్తూ.. వేధిస్తున్నారు...

సారాంశం

ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ప్రెస్ మీట్ పెట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు తననే బెదిరిస్తున్నారని వాపోయింది. 

విజయవాడ : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పిఏ లక్ష్మోజీ తనను వేధిస్తున్నారని అదే ప్రాంతానికి చెందినవార్డు వాలంటీర్ మెరుగు లలిత ఆరోపించారు. దీనిపై ఎస్సీ కమిషన్ చైర్మన్ తో పాటు పలువురికి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.  గురువారం విజయవాడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.. ‘మేము గుడివాడ బాపూజీ నగర్ 13వ వార్డులో నివసిస్తున్నాం. తిరుపతమ్మ చెరువుగట్టున మున్సిపాలిటీ స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. మూడు రోజుల క్రితం బోరు వేసేందుకు కూలీలు పనిచేస్తుండగా.. రోడ్డుకు అవతలి వైపు ఉన్న రమేష్, సురేష్ వచ్చి మా సామాన్లు చెల్లాచెదురుగా పడేశారు.

నాపై దాడి చేశారు.  వాళ్లకు భయపడి అక్కడినుంచి పారిపోయాను.  తర్వాత వారితో పాటు సురేష్ మామ సుబ్రహ్మణ్యం వచ్చాడు. ‘ముగ్గురు కలిసి నన్ను కులంపేరుతో దూషించి అసభ్యంగా ప్రవర్తించారు. చుట్టుపక్కల వాళ్ళు రావడంతో పారిపోయారు. డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయగా.. పోలీసులు వచ్చి వివరాలు తీసుకున్నారు. సాయంత్రం సిఐ దుర్గారావు పిలిపించారు. జరిగిందంతా ఆయనకు చెప్పాను.

గడప గడపకూపై మరోసారి వర్క్‌షాప్.. 19న తాడేపల్లికి పిలుపు, జగన్ వద్దకు చేరిన ప్రోగ్రెస్ రిపోర్ట్

వెంటనే బోరు పనులు ఆపేయాలని, లేకపోతే తిరిగి నీపైనే కేసు పెట్టాల్సి వస్తుందని సీఐ అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని పిఎ లక్ష్మోజీ దగ్గరకు వెళ్లగా.. నాతో అసభ్యంగా మాట్లాడారు. లక్ష్మోజీ  తన బంధువులైన రమేష్, సురేష్ లకు అండగా ఉంటూ.. నన్ను బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని లలిత ఆవేదన వ్యక్తం చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?