ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా ... రెండు కోట్లతో కిలేడీ పరారు

By Arun Kumar PFirst Published Aug 1, 2021, 10:56 AM IST
Highlights

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుండి కోట్లల్లో వసూలు చేసి పరారయ్యింది ఓ మహిళ. ఈ భారీ మోసం విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. 

విజయనగరం: ప్రభుత్వ ఉద్యోగం నిరుద్యోగి కల. అలాంటి నిరుద్యోగులకు ఎలాంటి శ్రమ లేకుండానే ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తానని నమ్మించి భారీ మోసానికి పాల్పడింది  ఓ కిలేడీ. అయితే ఇందుకోసం భారీగా డబ్బులు చెల్లించాల్సి వుంటుందంటూ నిరుద్యోగుల నుండి ఏకంగా రెండు కోట్లు వసూలుచేసింది. చివరకు ఆమె పాపం పండి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యింది.  

వివరాల్లోకి వెళితే...  విజయనగరం జిల్లా  రాముడువలస గ్రామానికి చెందిన గుంటా విజయరాణి మంచి మాటకారి. తన మాటలతో ఎంతటివారిని అయినా బురిడీ కొట్టించగలదు. ఈ మాయమాటలనే పెట్టుబడిగా పెట్టి భారీ మొత్తంలో ఈజీ మనీ సంపాదించాలని నిర్ణయించుకున్న ఆమె ప్రభుత్వ ఉద్యోగాల పేరిట భారీ మోసానికి తెరలేపింది. 

read more  సొంత కొడుకునే కిడ్నాప్ చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు: భార్యకు బెదిరింపులు

నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని... తనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పరిచయం వున్నారంటూ నమ్మించేది. ఆమె మాటలు నమ్మి నిజంగానే ఉద్యోగం ఇప్పిస్తుందని భావించి భారీగా డబ్బులు సమర్పించుకునేవారు. ఇలా నిరుద్యోగుల నుండి ఏకంగా రెండు కోట్ల వరకు వసూలు చేసింది ఈ కిలేడి. ఈ డబ్బుతో జల్సాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతోంది. ఆమె డబ్బులతో ఉడాయించడంతో మోసపోయిన నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. 

అయితే శనివారం రాత్రి విజయరాణి బొబ్బిలిలో ప్రత్యక్షమైంది. దీంతో బాధితులు తమ డబ్బు తిరిగి చెల్లించాలంటూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విజయరాణిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

click me!