నా భర్తకు జైలులో ప్రాణహాని: హైకోర్టు సిజేకు దేవినేని ఉమ భార్య అనుపమ లేఖ

By telugu teamFirst Published Aug 1, 2021, 10:46 AM IST
Highlights

రాజమండ్రి సెంట్రల్ జైలులో తన భర్తకు ప్రాణహాని ఉందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు భార్య దేవినేని ఉమ ఏపీ హైకోర్టు సీజేకు లేఖ రాశారు. ఆ లేఖను అమిత్ షా, బిశ్వహరిచందన్, మేకతోటి సుచరితలకు కూడా పంపించారు.

అమరావతి: రాజమండ్రి కేంద్ర కారాగారంలో తన భర్తకు ప్రాణహాని ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు భార్య దేవినేని ఉమ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమకు భద్రత కల్పించాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు, రాష్ట్ర ోహం మంత్రి మేకతోటి సుచరితకు కూడా ఆ లేఖను పంపించారు. 

ఆ లేఖను ఆమె శనివారం మీడియాకు విడుదల చేశారు.  రాజమహేంద్రవరం జైలు సూపరింటిండెంట్ ను అకస్మికంగా బదిలీ చేయడంతో తనకు అనుమానాలు కలుగుతున్నాయని ఆమె అన్నారు. దేవినేని ఉమా మహేశ్వర రావు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో చురుగ్గా పాల్గొంటున్నారని ఆమె చెప్పారు. అవినీతికి, మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని అన్నారు. 

ఆ క్రమంలోనే జులై 27వ తేదీన జి. కొండూరు మండలంలో ఉమపై దాడి జరిగిందని, ఆ తర్వాత తప్పుడు కేసులు పెట్టి తన భర్తను అరెస్టు చేసి జైలుకు తరలించారని ఆమె చెప్పారు గతంలో జైలులో హత్యలూ వేధింపులు చోటు చేసుకున్నాయని, అందువల్ల ఉమకు ప్రాణహాని ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆమె అన్నారు. 

దేవినేని ఉమా రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాను రాసిన లేఖకు దేవినేని అనుపమ సూపరింటిండెంట్ బదలీ ఉత్తర్వులను కూడా జతచేశారు. 

ఇదిలావుంటే, దేవినేని ఉమను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసుుల ఎస్సీ, ఎస్టీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఉమను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు.  

click me!