అనంతపురంలో మహిళా లెక్చరర్ గొంతు కోసిన భర్త.. పరిస్థితి విషమం..

Published : Nov 17, 2022, 01:04 PM IST
అనంతపురంలో మహిళా లెక్చరర్ గొంతు కోసిన భర్త.. పరిస్థితి విషమం..

సారాంశం

కుటుంబకలహాల నేపథ్యంలో ఓ భర్త భార్య గొంతును అతి దారుణంగా గొంతుకోశాడు. దీంతో ఆమె ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. 

అనంతపురం : అనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్ట్స్ కాలేజీలో మహిళా లెక్చరర్ మీద హత్యాయత్నం జరిగింది. కాలేజీలో కామర్స్ టీచ్ చేసే ప్రొఫెసర్ సుమంగళిని ఆమె భర్త పరేశ్  గొంతు కోశాడు. దీంతో లెక్చరర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. 

కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. భర్తతో విభేదాల కారణంగా కొంతకాలం క్రితం సుమంగళి కోర్టులో విడాకుల కేసు వేశారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఆమె మీద భర్త దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా, ఇలాంటి దారుణ ఘటనే హైదరాబాద్ లోని తిరుమలగిరిలో చోటు చేసుకుంది. తిరుమలగిరిలోని మడ్‌ఫోర్ట్‌లో సెప్టెంబర్ 17 ఉదయం 40 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. దేవమ్మ అనే ఆ మహిళ గొంతు కోసి హత్య చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు తిరుమల్ గిరి పోలీసులు తెలిపారు. అయితే, మృతురాలి ఒంటిమీద చెవిపోగులు కనిపించకపోవడంతో.. డబ్బుల కోసం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

తునిలో టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం: ఆసుపత్రికి తరలింపు

తెల్లవారి ఉదయం రక్తపు మడుగులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది హత్య అని నిర్ధారించిన పోలీసులు ముందుగా బాధితుడిని గుర్తించే పని మొదలుపెట్టారు. ఆమె ఫోటోను స్థానికంగా ఉన్న కాలనీల్లో పంచిపెట్టారు. దీని ద్వారా మృతురాలి గుర్తింపును తెలుసుకున్నారు. దేవమ్మ మద్యం మత్తులో ఉన్నప్పుడే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. 

ఆమె చివరిసారిగా ఎవరితో కనిపించిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె చివరిగా ఏ కల్లు దుకాణానికి వెళ్ళింది.. ఆమె మీద లైంగిక వేధింపులు జరిగాయో లేదో తెలియాలంటే పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. దేవమ్మ స్వస్థలం వనపర్తి జిల్లా. నెలరోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి దినసరి కూలీగా పనిచేస్తోంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది.

PREV
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?