తునిలో టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం: ఆసుపత్రికి తరలింపు

Published : Nov 17, 2022, 09:31 AM IST
తునిలో  టీడీపీ నేత  శేషగిరిరావుపై  హత్యాయత్నం: ఆసుపత్రికి  తరలింపు

సారాంశం

కాకినాడ జిల్లా  తునిలో  టీడీపీ  నేత శేషగిరిరావుసై  గుర్తు  తెలియని  దుండగుడు  దాడి చేశాడు.  ఈ  దాడిలో  గాయాలపాలైన  శేషగిరిరావును  కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. 

తుని:కాకినాడ  జిల్లా తునిలో  టీడీపీ నేత  శేషగిరిరావుపై  హత్యాయత్నం జరిగింది. భవానీ మాలలో  వచ్చిన  ఓ  దుండగుడు  శేషగిరిరావుపై  హత్యాయత్నానికి పాల్పడ్డాడు.  దుండగుడు  దాడి చేయడంతో  కేకలు  వేశాడు  శేషగిరిరావు.  శేషగిరిరావు  కేకలు  విన్న  కుటుంబసభ్యులు  ఇంటి నుండి  బయటకు  వచ్చారు. అప్పటికే  నిందితుడు  బైక్ పై  పారిపోయాడు.  నిందితుడు  దాడి చేసే సమయంలో  చేయిని  అడ్డుపెట్టాడు  శేషగిరిరావు.  దీంతో  శేసగిరిరావు  చేయికి తీవ్ర గాయాలయ్యాయి.  శేషగిరిరావును  కుటుంబసభ్యులు  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శేషగిరిరావు  చికిత్సపొందుతున్నాడు.శేషగిరిరావుపై  దుండగుడు  కత్తితో  దాడి చేసిన  దృశ్యాలు  సీసీటీవీ కెమెరాల్లో  రికార్డయ్యాయి.  శేషగిరిరావు కుటుంబ సభ్యుల  ఫిర్యాదు  మేరకు  పోలీసులు కేసు  నమోదు చేసుకొని  దర్యాప్తు  చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

YS Jagan On Seediri Appalraju Son Issue | YS Jagan Press Meet | Asianet News Telugu
బాబు పాలనలో గంజాయికి గిట్టుబాటు ధర బాగుంది: YS Jagan | Asianet News Telugu