
చిత్తూరు: అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లెలో విషాద చోటు చేసుకుంది. మంగంపేట బైరెటీస్ లో బ్లాస్టింగ్ తో పేలుడుతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ బ్లాస్టింగ్ పనులతో అగ్రహరం గ్రామంలో ఓ ఇంటి గోడ కూలింది. గోడ మీద పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహంతో ఏపీఎన్ఎండీసీ కార్యాలయం ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బ్లాస్టింగ్ ల కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అగ్రహరం గ్రామస్తులు చెబుతున్నారు. బ్లాస్టింగ్ లను నిలిపివేయాలని అగ్రహరం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.