నవాబుపేటలో 10 మందికి కరోనా: రోగుల తరలింపును చూస్తూ గుండె పగిలి మహిళ మృతి

Published : Jun 03, 2020, 11:14 AM ISTUpdated : Jun 03, 2020, 11:20 AM IST
నవాబుపేటలో 10 మందికి కరోనా: రోగుల తరలింపును చూస్తూ గుండె పగిలి మహిళ మృతి

సారాంశం

కడప జిల్లా మైలవరం మండలం నవాబుపేటలో  విషాదం నెలకొంది. కరోనా రోగులను తరలించడం చూసిన ఓ మహిళ గుండెపోటుతో బుధవారం నాడు మృతి చెందింది.


కడప: కడప జిల్లా మైలవరం మండలం నవాబుపేటలో  విషాదం నెలకొంది. కరోనా రోగులను తరలించడం చూసిన ఓ మహిళ గుండెపోటుతో బుధవారం నాడు మృతి చెందింది.

నవాబుపేట గ్రామంలో 10 మందికి కరోనా సోకిందని అధికారులు గుర్తించారు. ఈ 10 మందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఇవాళ ఉదయం గ్రామానికి వచ్చారు.కరోనా లక్షణాలు ఉన్న 10 మంది రోగులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న విషయాన్ని గుర్తించిన ఓ మహిళ గుండెపోటుతో మరణించింది.

also read:ఒకే గ్రామం, ఒకే సూపర్ స్ప్రెడర్... 117మందికి కరోనా

ఒకే గ్రామంలో 10 మందికి కరోనా సోకడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ఈ ఘటనను చూసిన మహిళ మృతి చెందడం కూడ గ్రామంలో విషాదాన్ని నింపింది.ఏపీ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కరోనా నివారణ కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.

దేశ వ్యాప్తంగా  బుధవారం నాటికి రెండు లక్షలకు పైగా కరోనా కేసులు దాటాయి. వరుసగా దేశంలో కరోనా కేసులు   8 వేలకు పైగా నమోదౌతున్నాయి.  ఈ తరుణంలో  కరోనా సోకిన రోగులు చికిత్స తర్వాత కోలుకొంటున్న సంఖ్య 48కి పైగా శాతం ఉందని కేంద్రం తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!