విజయవాడ గ్యాంగ్‌వార్: ఏడాది నాటి ఘటనలో 57 మందిపై బైండోవర్ కేసులు

By Siva KodatiFirst Published Oct 16, 2021, 8:06 PM IST
Highlights

విజయవాడలో (vijayawada police) 57 మందిని బైండోవర్ (bind over) చేస్తూ నగర పోలీస్ కమీషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది మే 30న నగరంలోని రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్ (vijayawada gang war) జరిగింది. కత్తులు, రాడ్లతో జరిగిన ఘర్షణలో ఓ గ్యాంగ్‌కు చెందిన సందీప్ అనే వ్యక్తి మరణించాడు. 

విజయవాడలో (vijayawada police) 57 మందిని బైండోవర్ (bind over) చేస్తూ నగర పోలీస్ కమీషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది మే 30న నగరంలోని రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్ (vijayawada gang war) జరిగింది. కత్తులు, రాడ్లతో జరిగిన ఘర్షణలో ఓ గ్యాంగ్‌కు చెందిన సందీప్ అనే వ్యక్తి మరణించాడు. నాటి కేసుకు సంబంధించి 57 మందిని అప్పుడే అరెస్ట్ చేశారు పోలీసులు. 

కాగా, దీనిని తొలుత రెండు విద్యార్ధి గ్రూపుల మధ్య వివాదంగా అంతా భావించారు. మీడియాలో సైతం ఇదే రకమైన కథనాలు వచ్చాయి. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.2 కోట్ల విలువైన స్థలం కోసం ఘర్షణ జరిగినట్లు తెలిసింది. నగరంలోని యనమలకుదురులో (yanamalakuduru) ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో భాగంగా ఈ వివాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

ALso Read:విజయవాడ గ్యాంగ్ వార్‌లో మరో ట్విస్ట్: సందీప్‌ను పక్కా ప్లాన్‌తో హత్య చేశారన్న భార్య తేజస్విని

ఒకే స్థలం విషయంలో ఇద్దరు జోక్యం చేసుకోవడంతో గొడవ జరిగింది. ఇంతటి విలువైన ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు ఇరువర్గాలు పథకం వేశాయి. రాజీ కుదుర్చుకునేందుకు వచ్చిన ఇరు వర్గాలు ఆ ముసుగులో పథకాన్ని అమలు చేయడానికి రెండు వర్గాలు సిద్ధమయ్యాయి. పక్కా ప్లాన్‌తో కత్తులు, కర్రలతో వెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇరువర్గాలపై ఐపీసీ సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

అప్పట్లో విజయవాడ గ్యాంగ్ వార్ ఘటనను పోలీసులు తీవ్రంగా తీసుకొన్నారు.  సందీప్, (sundeep) పండు (pandu) గ్యాంగ్‌వార్‌ల ఘటనలో ఈ రెండు గ్యాంగ్‌ల్లో ఉన్న వారిని నగరం నుండి బహిష్కరిస్తున్నట్టుగా డీసీపీ అప్పట్లోనే ప్రకటించారు. ఈ ఘటన తర్వాత బెజవాడలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. సందీప్- పండుల మధ్య గ్యాంగ్‌వార్ నేపథ్యంలో నగరంలోని రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. విజయవాడ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఆ సమయంలోనే 470 మంది రౌడీషీటర్లను గుర్తించిన పోలీసులు.. ప్రతివారం కౌన్సెలింగ్ ఇచ్చారు.

click me!