ఎస్పీ కార్యాలయ ఆవరణంలో మహిళ ఆత్మహత్యాయత్నం, స్పృహ తప్పిన మహిళా కానిస్టేబుల్...(వీడియో)

Published : Mar 28, 2022, 01:01 PM IST
ఎస్పీ కార్యాలయ ఆవరణంలో మహిళ ఆత్మహత్యాయత్నం,  స్పృహ తప్పిన మహిళా కానిస్టేబుల్...(వీడియో)

సారాంశం

గుంటూరులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను ఆస్పత్రికి తరలించే క్రమంలో మహిళా కానిస్టేబుల్ స్పృహ తప్పింది. 

గుంటూరు : గుంటూరు ఎస్పీ కార్యాలయ ఆవరణంలో దుర్గి మండలానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ ఫిర్యాధు చేయటానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన అక్కడివారు, పోలీసులు ఆమెను గుంటూరు ప్రభుత్వ వైధ్యశాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే అదే సమయంలో అనుకోని ఘటన జరిగింది. 

"

పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువతిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ సడన్ గా అనారోగ్యానికి గురైంది. ఓ మహిళ కానిస్టేబుల్ ఒక్కసారిగా తల పట్టుకుని సృహ తప్పికింద పడిపోయింది. దీంతో పక్కనే ఉన్న మహిళా పోలీసులు ఆమెకు దెబ్బలు తగలకుండా పట్టుకున్నారు. ఈ ఘటనపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే రాజేశ్వరి ఆత్మహత్య యత్నంకు గల కారణాలపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా తెలంగాణలోని కోరుట్లలో ఓ యువకుడు చిన్న కారణానికి ప్రాణాలు తీసుకున్నాడు. తనకు ఇంట్లో వాళ్ళు కారు కొనివ్వడం లేదని సీపల్లి భాను ప్రకాష్ గౌడ్ (22) అనే యువకుడు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్సై సతీష్ కథనం ప్రకారం కల్లూరు గ్రామానికి చెందిన సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కుమారులు,  ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు భాను ప్రకాష్ గౌడ్ కొంత కాలంగా కారు కొనివ్వాలని కుటుంబ సభ్యులను కోరుతూ వస్తున్నాడు.

 15 రోజులుగా మరింత పట్టుబట్టి ఇంట్లో వారిని అడిగితే, ఎవరూ పట్టించుకోవడం లేదనే కారణంతో శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామ శివారులో యాసిడ్ తాగాడు. ఆ తర్వాత మంటను తాళలేక కేకలు వేస్తూ రోడ్డు పైకి వచ్చాడు. ఇది గమనించిన స్థానికులు భానుప్రకాష్ ఇంటికి తీసుకువెళ్లారు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భాను ప్రకాశ్ మృతి చెందాడు. ఇదివరకు కూడా సెల్ ఫోన్ కొనివ్వలేదని భానుప్రకాశ్ చేయి కోసుకున్నట్లు సమాచారం. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu
CM Chandrababu Naidu: చరిత్రలో నిలిచిపోయే రోజు సీఎం చంద్రబాబు| Asianet News Telugu