పాము కాటుతో ఏడేళ్ల చిన్నారి మృతి.. విజయనగరం జిల్లాలో ఘటన

Published : Mar 28, 2022, 10:46 AM IST
పాము కాటుతో ఏడేళ్ల చిన్నారి మృతి.. విజయనగరం జిల్లాలో ఘటన

సారాంశం

పాము కాటుతో ఏడేళ్ల చిన్నారి చనిపోయింది. అన్నం తిన్న వెంటనే చేతులు కడుక్కోవడానికి బయటకు వచ్చిన ఆ చిన్నారిని పాము కాటేసింది. దీంతో పాపను హాస్పిటల్ తీసుకెళ్లున్న క్రమంలోనే  మరణించింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. 

అభం శుభం తెలియ‌ని ఓ చిన్నారి పాము కాటుకు బ‌లి అయ్యింది. స్నేహితుల‌తో ఆడుకోవాల్సిన వ‌య‌స్సులో అంద‌నంత దూరానికి వెళ్లిపోయింది. అంత‌సేపు కుటుంబ స‌భ్యుల‌తో ముద్దులొలికేలా మాట్లాడిన ఆ చిన్నారి.. మృత్యు ఒడిలో నిద్ర‌పోయింది. ఈ ఘ‌ట‌న ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చోటు చేసుకుంది. 

విజ‌య‌న‌గ‌రం (vizianagaram) జిల్లా ద‌త్తిరాజేరు (dattirajeru) మండ‌లం పెదమానాపురం (pedamanapuram) గ్రామానికి చెందిన చిన్నారి పాము కాటు వ‌ల్ల శ‌నివారం చ‌నిపోయింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాల ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ల‌క్ష్మ‌ణ‌రావు (laxmanarao), విజ‌య లక్ష్మి (vijyalaxmi) కూతురు వ‌ర్షిణి (varshini)కి ఏడు సంవ‌త్స‌రాలు. ప్ర‌స్తుతం రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోంది. అంత సేపు కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డిపింది. శనివారం రాత్రి అన్నం తిన్న త‌రువాత చేతులు క‌డుక్కోవ‌డానికి బ‌య‌ట‌కు వెళ్లింది. త‌ల్లిదండ్రులు దీనిని గ‌మ‌నించారు. 

స్థానికంగా ఉండే గ‌జ‌ప‌తిన‌గ‌రం (gajapathinagaram) సామాజిక ఆసుప‌త్రికి ఆ చిన్నారిని తీసుకెళ్తుండ‌గా మార్గమ‌ధ్యంలోనే ప‌రిస్థితి విష‌మించి చ‌నిపోయింది. ఈ ఘ‌ట‌న ఒక్క సారిగా గ్రామంలో విషాదం నింపింది. ముద్దులొలికే ఆ చిన్నారి ఒక్క సారిగా మూగ‌బోవ‌డంతో ఆ త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. స్కూల్ టీచ‌ర్లు, స్టూడెంట్లు సంతాపం తెలియజేశారు. 

ఇదే జిల్లాలో ఈ నెల 4వ తేదీన కూడా పాము కాటుతో ఓ స్టూడెంట్ మృతి చెందింది. కురుపం (kurupam) రెసిడెన్షియ‌ల్ స్కూల్ (residencial school)లో స్టూడెంట్ల‌కు బెడ్స్ లేక‌పోవ‌డంతో అంద‌రూ నేల‌మీద‌నే ప‌డుకున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో హాస్ట‌ల్ లోకి చొర‌బ‌డిన పాము ముగ్గురు స్టూడెంట్ల‌ను క‌రిచింది. అయితే ఇందులో ఒక స్టూడెంట్ మృతి చెందారు. మిగితా ఇద్ద‌రు స్టూడెంట్లు కోలుకున‌నారు. ఈ స్కూల్ లో మొత్తం 217 మంది విద్యార్ధులున్నారు. పాము కాటుకు గురైన విద్యార్ధులంతా 8వ తరతగతి చ‌దువుతున్నారు. విద్యార్ధులను కాటేసిన పామును సిబ్బంది చంపేశారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ లో  సిబ్బంది నిర్ల‌క్ష్య‌మే ఈ ప్రమాదానికి కార‌ణ‌మ‌ని తల్లిదండ్రులు ఆరోపించారు. 

ఆదిలాబాద్ (adilabad) జిల్లాలోనూ ఈ నెల 18వ తేదీన ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. పాము కాటుతో ఓ స్టూడెంట్ చ‌నిపోరారు. బేల (bela) మండలం బెదోడ (bedoda) గ్రామానికి చెందిన ప్రణాళి పాము Adilabad లోని ఓ ప్రైవేట్ కాలేజీలో Degree చదువుతోంది. Pranaali కి  గతంలో రెండు సార్లు పాము కరిచింది. రెండు దఫాలు ఆమె కాటు నుంటి ప్రాణాలతో బయట పడింది. కానీ చివరికి ఈ నెల 18వ తేదీన  ఆమెను పాము కరిచింది. Hospitalలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. 

గత ఏడాది సెప్టెంబర్ (september) నెలలో ప్రణాళి తన నివాసంలో నిద్రిస్తున్న సమయంంలో పాము కాటుకు గురైంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సుమారు రూ. 4 లక్షలు ఖర్చు చేసి ఆమెను రక్షించుకొన్నారు.  ఆ తర్వాత ఈ ఏడాది జనవరి మాసంలో మరో సారి ఆమె పాము కాటుకు గురైంది. ఇంటి ఆవరణలో కూర్చొన్న సమయంలో ఆమెను పాము కరిచింది. ఈ సమయంలో కూడా ఆమె చికిత్స నుండి కోలుకుంది. ఈ నెల 18వ తేదీన Holi ని పురస్కరించుకొని తన స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రణాళి ప్లాన్ చేసుకొంది. తన కాలేజీ బ్యాగులో రంగులను తెచ్చుకొంది. అయితే ఈ బ్యాగులో పాము ఉంది.ఈ విషయాన్ని గుర్తించ‌ని ప్రణాళి బ్యాగులో రంగులను బయటకు తీస్తున్న సమయంలో పాము కాటు వేసింది. ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రణాళి మరణించింది. ఈ ఘ‌ట‌న జిల్లా వ్యాప్తంగా ఆందోళ‌న రేకెత్తించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం