ఏపీ బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయా? నేతల మధ్య విభేదాలు బయట పడుతున్నాయా? ప్రస్తుత అధ్యక్షుడైన సోమూ వీర్రాజు మీద వ్యతిరేకలు వెల్లువెత్తుతున్నాయా? అంటే అవుననే అనిపిస్తుంది తాజాగా జరిగి ఓ సమావేశం.
విజయవాడ : ప్రస్తుత పార్టీ అధ్యక్షుడుSomu Veerrajuకు వ్యతిరేకంగా Vijayawadaలో ఒక హోటల్ లో నేతలు సమావేశమయ్యారు. జాతీయ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్
Jayaprakash Narayana అద్వర్యంలో పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకూమార్ కు ఆత్మీయసమావేశం పేరుతో ఈ సభ ఎర్పాటయ్యింది.
BJP నేతలు కన్నా లక్ష్మి నారాయణ లంకా దినకర్, తురగా నాగభూషణం, జమ్ముల శ్యామ్ కిషోర్, కిలారు దిలిప్ పాతూరి నాగభూషణం మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.. రమేష్ నాయుడు ఎస్ కె బాజీ శ్రీనివాసరాజు ఇతర ముఖ్య నేతలు హజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ఎపి బిజెపి అధ్యక్షుడి పేరు ప్రస్తవన లేకుండా సమావేశం జరగడం సర్వత్రా చర్చనీయాంశంా మారింది.
undefined
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయానికి తన వంతు కృషిచేసిన సత్యకుమార్ ను ఎపి రాజకీయాలపై దృష్టి పెట్టాలని నేతలు కోరారు. అంతేకాదు త్వరలో ఏపీ బీజేపీ అద్యక్ష పదవి మార్చే అవకాశం ఉంటుందని.. సోము వీర్రాజు వ్యతిరేక వర్గం భావిస్తున్నారు. వారికి ఈ సమావేశం ఆశావహంగా కనిపించింది.
ఈ సమావేశంలో అధ్యక్ష పదవి కోసం పోటి పడుతున్న నేతలు సత్యకుమార్ ను పోగడ్తలతో ముంచేత్తారు. కాగా ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేకుండా సమావేశం నిర్వహించటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, వారం రోజుల క్రితం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు. బీజేపీ - జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు వుంటుందని పవన్ కల్యాన్ చెప్పలేదని ఆయన అంటున్నారు. అంతకుముందు ప్రెస్‌మీట్లు కాదు డైరెక్ట్ డిబేట్‌కు తాము సిద్ధమన్నారు సోము వీర్రాజు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించి రాబోయే రోజుల్లో తాము ఆందోళన ఉద్ధృతం చేస్తామని సోము వీర్రాజు తెలిపారు.
2014-15లో ఏపీ విభజన తర్వాత కేంద్ర పన్నుల కింద రూ.24,500 కోట్లు ఇచ్చామని చెప్పారు. 2020-21 నాటికి రూ.72,000 కోట్లు ఇచ్చామని సోము వీర్రాజు వెల్లడించారు. తాము ఇన్ని నిధలు ఇవ్వబట్టే.. నవరత్నాల కింద సంక్షేమ కార్యక్రమాలకు వాడుతున్నారంటూ ఆయన ఫైరయ్యారు. కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకుంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ సోము వీర్రాజు మండిపడ్డారు. కడపలో తాము నిర్వహించిన సభకు భారీ స్పందన రావడంతో వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలపై అభిమానంతో ఏపీ రహదారుల కోసం రూ.65000 కోట్లు ఇచ్చామని సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్రం నిధులు వాడుకుంటూనే తిట్టడం సబబు కాదన్నారు. జగన్ పాలనలో వేసిన రోడ్లు ఎన్ని అని ఆయన ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఇళ్లు ఇచ్చామని.. ఇందుకోసం రూ.32 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.
ఇకపోతే.. ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదని జనసేన 8వ ఆవిర్భవ సభలో తెలిపారు. కాబట్టి, తాము అన్ని శక్తులు కలిసి వెళ్తాయని చెప్పారు. అయితే, భవిష్యత్ పోరాటానికి సంబంధించి బీజేపీ తమకు రోడ్ మ్యాప్ అందించాలని కోరారు. బీజేపీ రోడ్ మ్యాప్ అందిస్తే.. అమలు చేయడమే ఆలస్యం అన్నట్టుగా పేర్కొన్నారు. తన వ్యాఖ్యల్లో ఆయన బీజేపీతోపాటు టీడీపీనీ కలుపుకోవాలనే ఉద్దేశ్యం ధ్వనించింది.