మోసం చేసిన ప్రియుడిని చితకబాదిన ప్రియురాలు.. వీడియో వైరల్...

Published : Feb 24, 2022, 12:52 PM ISTUpdated : Feb 24, 2022, 01:14 PM IST
మోసం చేసిన ప్రియుడిని చితకబాదిన ప్రియురాలు.. వీడియో వైరల్...

సారాంశం

ఏడాది పాటు ప్రేమించి.. తీరా పెళ్లి చేసుకోమంటే పెద్దల పేరు చెప్పి మొహం చాటేసిన ప్రేమికుడికి దేహశుద్ధి చేసిందో ప్రేమికురాలు. నన్నే మోసం చేస్తావా.. అంటూ దాడికి దిగింది. 

కర్నూలు :  ఆయన పొలం యజమాని.  ఆ పొలంలోనే ఓ woman వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. ఇద్దరు ఇష్టపడ్డారు. ఏడాదిపాటు ప్రేమించుకున్నారు. marriage చేసుకుంటానని మాటిచ్చిన  యువకుడు మొహం చాటేశాడు. దీంతో నన్నే మోసం చేస్తావా... అంటూ యువతి బంధువులు ఎదుటే.. ప్రియుడికి బడిత పూజ చేసింది.  వివరాల్లోకి వెళితే.. కల్లూరు మండలం చిన్నటేకూరుకి చెందిన శేఖర్, పెద్దటేకూరు గ్రామానికి చెందిన మునీ మధ్య  ఏడాది కాలంగా love affair నడుస్తోంది.  

తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరగా.. కుటుంబ సభ్యులు వద్దంటున్నారు అని శేఖర్ బదులిచ్చాడు. యువతి వినకపోవడంతో పెద్దలందరూ పోలీస్స్టేషన్లో పంచాయతీ పెట్టారు. సదరు యువతి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. నాకు కేసు వద్దు అతనితో పెళ్లి జరిపించాలని యువతి కోరింది. కానీ శేఖర్ ససేమిరా అన్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల యువతి ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించుకుని తెలంగాణలోని బంధువులు ఊరికి తీసుకువెళ్ళింది.  

ఆ ఊరిలో దేవాలయం ముందు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని కోరింది. ప్రియుడు నిరాకరించడంతో అక్కడే ఉన్న కర్రతో చితకబాదింది. ఈ ఘటనను అక్కడున్నవారు వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో... వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా... సదరు యువతి ప్రేమ విషయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలతో బయట పడింది. ఈ ఘటనపై పోలీసుల వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. 

ఇదిలా ఉండగా, నిరుడు జూలైలో కడపలో హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని ఓ మహిళ చెప్పడంతో యువతి హిజ్రాగా మారింది. ఇప్పుడు పెళ్లి చేసుకోనంటూ.. మహిళ ముఖం చాటేయడంతో బాధితురాలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెడితే.. కడపకు చెందిన ఓ యువతి తండ్రి చనిపోవడంతో ఆమెకు కారణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు. 

శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడే శిక్షణలో ఉన్న ఓ మహిళ పరిచయమయింది. ఇరువురికి వివాహం కాలేదు. మంచి స్నేహితులుగా మారారు. యువతికి అబ్బాయి లక్షణాలున్నాయి. నీవు హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని పరిచయమైన మహిళ యువతిని బలవంతపెట్టింది.

ఆమె మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది. ఇరువురు కలిసి జీవిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని మహిళ ముఖం చాటేసింది. వారి ప్రేమను మహిళ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. మహిళను నిర్భంధించారు. హిజ్రాగా మారమని చెప్పి ఇప్పుడు మోసం చేసిందని, ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును ఎలా పరిష్కరించాలని పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Return rush: పండ‌గ అయిపోయింది.. ప‌ల్లె ప‌ట్నం బాట ప‌ట్టింది. హైవేపై ఎక్క‌డ చూసినా వాహ‌నాలే
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet