‘సాక్షి’ టీవీకి అనుమతులు రద్దు... సెక్యూరిటీ క్లియరెన్స్ కు నో..

Published : Feb 24, 2022, 11:42 AM IST
‘సాక్షి’ టీవీకి అనుమతులు రద్దు... సెక్యూరిటీ క్లియరెన్స్ కు నో..

సారాంశం

ముఖ్యమంత్రి జగన్ సొంత టీవీ ఛానల్ ‘సాక్షి’కి కేంద్ర సమాచార, ప్రసార శాఖ షాకిచ్చింది. సాక్షి టీవీకి జారీ చేసిన అనుమతిని రద్దు చేసింది. దేశంలో అనుమతించిన చానళ్ల జాబితా నుంచి ‘సాక్షి’ని  తొలగించింది. 

అమరావతి : గత నెల 20వ తేదీన కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘Sakshi TV’కి కేంద్ర హోంశాఖ ‘Security clearance’ ఇవ్వక పోవడమే దీనికి కారణం.  దేశ Internal securityను  దృష్టిలో ఉంచుకుని… కొన్ని ప్రమాణాలకు లోబడి మాత్రమే Central Home Department ‘సెక్యూరిటీ క్లియరెన్స్’ మంజూరు చేస్తుంది.

అది ఉంటేనే సదరు చానెల్ కు కేంద్ర సమాచార ప్రసార శాఖ అనుమతి లభిస్తుంది. స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందిన ఛానల్ కు హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఆ ఛానల్ నుంచి అంతర్గత భద్రతకు ముప్పు ఉందని భావించిందా? లేక.. జగన్ పై అక్రమాస్తుల కేసులు ఉన్నందుకేనా?  ఇవేవి కాకుండా.. మరేమైనా కారణాలున్నాయా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియదు. కానీ, సాక్షిటీవీ ఉద్యోగులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి, ఛానల్ ను మూసివేస్తే వందల మంది జీవనోపాధి దెబ్బ తింటుంది అని చెప్పడంతో అక్కడ తాత్కాలికంగా ఊరట లభించింది.

 ఇలా.. అనుమతులు రద్దు..
 సాక్షి టీవీకి అనుమతులు రద్దు చేస్తూ గత నెల 20వ తేదీన కేంద్ర సమాచార ప్రసార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ సంస్థ  సాక్షి టీవీ పేరుతో  నడిపే ఛానల్ కు  2006 జూన్ 7వ తేదీన  పదేళ్ల పాటు  అప్ లింక్, డౌన్లోడింగ్  అనుమతులు జారీ చేశాం. ఛానల్ ఏర్పాటుకోసం అందిన దరఖాస్తులను పరిశీలించి,  అన్ని అర్హతలు ఉంటే  సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం  కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపిస్తాం. తొలుత ఇచ్చిన నా అనుమతి కాలం ముగిసిపోవడంతో..  సాక్షి టీవీ మరోసారి అనుమతులను  పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకుంది.

 2016 జూన్ 7 నుంచి 2026 జూన్ 6వ తేదీ వరకు ప్రసారాలను అనుమతించాలని కోరింది. ఈ దరఖాస్తును కూడా కేంద్ర హోం శాఖకు పంపించాం. అయితే… సాక్షి టీవీకి క్లియరెన్స్ ను హోం శాఖ నిరాకరించింది’’ అని సమాచార, ప్రసార శాఖ పేర్కొంది.  ఈ నేపథ్యంలో…  ‘సాక్షి’ టీవీ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి’ ఆ సంస్థకు 2021 డిసెంబర్ 31వ తేదీన షోకాజ్ నోటీసు జారీ చేసింది.  దీనికి ఆ సంస్థ గత నెల 13న సమాధానమిచ్చింది.  తమ ఛానల్ కు కేంద్ర హోంశాఖ అనుమతులు ఎందుకు ఇవ్వలేదో తెలియదని,  ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని కోరింది. 

 ఈ వివరణనను సమాచార, ప్రసార శాఖ పరిశీలించింది. అయితే…  తే.గీ దేశ అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకుని,  కొన్ని ప్రమాణాలకు లోబడి హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇస్తుంది. అదే లేకపోవడంతో  సాక్షి టీవీ ప్రసారాల  అనుమతిని  పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ‘ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ కు జారీ చేసిన అనుమతిని రద్దు చేస్తున్నాం. దేశంలో అనుమతించిన ప్రైవేట్ ఛానల్ లో నుంచి సాక్షి టీవీ పేరు తొలగిస్తున్నాం’ అని సమాచార ప్రసార శాఖ స్పష్టం చేసింది.

హైకోర్టులో ‘తాత్కాలిక’ ఊరట…
‘సాక్షి’  టీవీకి అనుమతులు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ ఛానల్ సిబ్బంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఛానల్ ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోందని..  రద్దు  ఆదేశాలను కొట్టివేసి, అనుమతుల పునరుద్ధరణకు తగిన ఆదేశాలు ఇవ్వాలని 15 మంది ఉద్యోగులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.  తగిన కారణాలు చూపకుండానే  కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ను నిరాకరించిందని  తెలిపారు. 

‘ఏదైనా ప్రతికూల చర్య తీసుకునే ముందు  సంబంధిత సంస్థకు చెందిన వాటాదారులు,  కార్మికులు, వినియోగదారులు, ఇతరుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి  తీసుకోవాలని  గతంలో  సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ,  ఇందుకు విరుద్ధంగా ఛానల్ అనుమతులు రద్దు చేశారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా,  ఏకపక్షంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.  ఈ నిర్ణయం వల్ల కంపెనీ అస్తిత్వానికి, ఉద్యోగుల భవిష్యత్తుకు ముప్పు ఏర్పడుతుంది.  కంపెనీ అనుమతి/ లైసెన్స్ మంజూరు కు సంబంధించి ఎలాంటి భద్రతా సంబంధిత నిబంధనలను ఉల్లంఘించే లేదు’  అని తెలిపారు.

 గతంలోనూ ఇలాగే ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ కు టెలి పోర్ట్ లైసెన్స్ను  రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు  స్టే విధించింది అని గుర్తు చేశారు.  ఆ పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉందన్నారు. ఇప్పుడు చానల్కు అనుమతులు రద్దు చేయడం సరికాదని తెలిపారు. దీనిపై తెలంగాణ హైకోర్టు సాక్షి టీవీకి తాత్కాలికంగా ఊరట ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయి.

ఏమిటీ ‘క్లియరెన్స్’?
 టీవీ చానళ్ల అప్ లింక్,  డౌన్లోడింగ్  అనుమతులను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంజూరు చేస్తుంది. అయితే,  ఛానల్ ఎవరు పెడుతున్నారు?  డైరెక్టర్ ఎవరు?  వారి నేపథ్యం ఏమిటి?  అనే వివరాలను కేంద్ర హోంశాఖ పరిశీలిస్తుంది. ఉదాహరణకు.. వేర్పాటు వాదులు, ఉగ్రవాదులు, మాఫియా నేతలు న్యూస్ ఛానల్ లో పెట్టి దేశ వ్యతిరేక ప్రచారం చేస్తే ఎలా?  అందుకే..  అన్ని పరిశీలించిన కేంద్ర హోంశాఖ  సెక్యూరిటీ క్లియరెన్స్ జారీ చేస్తుంది. 

 ఇక అప్పటికే సెక్యూరిటీ అనుమతులు ఇచ్చినప్పటికీ యాజమాన్యం  మారినా,  షేర్ హోల్డర్లు మారిన  సెక్యూరిటీ క్లియరెన్స్  అవసరమవుతుంది.  సాక్షి టీవీ విషయంలో ఈ అనుమతిని నిరాకరించడానికి బైటికి చెప్పలేని అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.  2006లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ ఈ చానల్ ను ప్రారంభించారు. అప్పుడు ఆయనే ఈ ఛానల్ కు సారధి. ఆ తర్వాత జగన్ పై అనేక అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. 

‘ క్విడ్ ప్రో కో’ లో  భాగంగా ముడుపులు తీసుకుని వాటిని తన మీడియా సంస్థల్లో పెట్టుబడులు గా చూపించారు  అని  సి.బి.ఐ నిర్ధారించింది.  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా కేసులు పెట్టింది. ‘సాక్షి’  టీవీ  ఖాతాలను స్తంభింప చేసింది. ఆ తర్వాత సాక్షి టీవీ చైర్ పర్సన్ గా ఆయన సతీమణి భారతి బాధ్యతలు స్వీకరించారు.  జగన్ సీఎం అయిన తర్వాత భారతి, సజ్జల  రామకృష్ణారెడ్డి  తదితరులు బోర్డు నుంచి తప్పుకున్నారు.  అటు సాక్షి టీవీ పై కేసులు,  ఇది యాజమాన్య మార్పులు..  ఇదే క్రమంలో కేంద్ర హోంశాఖ జగన్ చానల్ కు సెక్యూరిటీ క్లియరెన్స్ నిరాకరించడం  సంచలనం సృష్టిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu