
నర్సీపట్నం : విశాఖ జిల్లా నర్సీపట్నంలోని టిడిపి సీనియర్ నేత Ayyanna Patrudu, ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా nallajerlaలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణసభ లో సీఎం జగన్ పై అనుచిన వ్యాఖ్యలు చేశారంటూ.. నమోదైన కేసులో పోలీసులు నిన్న అయ్యన్న పాత్రుడిని నోటీసులు ఇచ్చారు. ఆ తరువాత నిన్నటి నుంచి పోలీసులు అయ్యన్న ఇంటివద్దే ఉండడంతో arrest చేస్తారనే ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు అయ్యన్న ఇంటికి తరలి వచ్చారు. వైసీపీ ప్రభుత్వం టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని కార్యకర్తలు మండిపడ్డారు. తమ నాయకుడిని అరెస్టు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరడంతో అక్కడ పరిస్తితి ఉద్రిక్తంగా ఉంది. అయితే పోలీసులు మాత్రం ఏ విషయం చెప్పకుండా అక్కడే ఉన్నారు.
ఇదిలా ఉండగా, బుధవారం మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటికి పశ్చిమగోదావరి జిల్లా nallajerla policeలు వచ్చారు. ఇటీవల నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ నమోదైన కేసుపై అయ్యన్న ఇంటికి పోలీసులు వచ్చారు.వీరిలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిఐ ఏ రఘు, నల్లజర్ల ఎస్ఐ ఐ అవినాష్, దేవరాపల్లి ఎస్ఐ కె శ్రీ హరి రావు ఉన్నారు. అయ్యాన్నకు 41(A) నోటీసు ఇచ్చేందుకే వచ్చామని పోలీసులు తెలిపారు.
అయితే అయన్న ఇంట్లో లేరని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా ఆయన ఇంట్లోనే ఉన్నట్లు తమకు సమాచారం ఉందని.. ఆయనకు స్వయంగా నోటీసు ఇచ్చి వెళ్లేందుకు ఆయన ఇంటివద్దే పోలీసులు వేచి చూస్తున్నామని పోలీసులు తెలిపారు.