ఈ లేడీ యమ కిలాడీలా వుందే... మందు కోసం ఏకంగా చిన్న సొరంగమే తవ్వేసిందిగా..! (వీడియో)

Published : Nov 02, 2023, 11:05 AM ISTUpdated : Nov 02, 2023, 11:09 AM IST
ఈ లేడీ యమ కిలాడీలా వుందే... మందు కోసం ఏకంగా చిన్న సొరంగమే తవ్వేసిందిగా..! (వీడియో)

సారాంశం

పోలీసులు కళ్లుగప్పి తెలంగాణ మద్యాన్ని ఏపికి తరలించడమే కాదు గుట్టుగా దాచి ఆమ్ముకుంటూ సరికొత్త దందా చేస్తోందో కిలాడీ మహిళ.  నందిగామలో సాగుతున్న తెలంగాణ మద్యం అమ్మకాల గుట్టు రట్టుచేసారు పోలీసులు. 

నందిగామ : తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం రేట్లు చాలా ఎక్కువ. దీంతో తెలంగాణ మద్యంను అక్రమంగా ఏపీకి తరలించే ముఠాలు ఎక్కువైపోయాయి. ఇలా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ మహిళ కూడా తెలంగాణ మద్యం దందా చేపట్టింది. అయితే ఈ మద్యం బాటిల్స్ దాచేందుకు ఏకంగా చిన్నపాటి సొరంగమే తవ్వేసింది సదరు కిలేడీ. ఆమె మద్యం దాచిన తీరుచూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన నాగమణి బెల్డ్ షాప్ నిర్వహిస్తోంది. ఈమె దగ్గర కేవలం ఏపీ మందే కాదు తెలంగాణ మద్యం కూడా లభిస్తుంది. తెలంగాణలో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి ఏపీలో ఎక్కువ ధరకు అమ్ముకుంటోంది. నాగమణి తెలంగాణ మద్యం దందా గురించి తెలిసి పోలీసులకు తెలిసిపోయింది. 

వీడియో

నందిగామ ఎసిపి జనార్ధన నాయుడు నేతృత్వంలో ఓ బృందం అనాసాగరం గ్రామానికి చేరుకుని నాగమణిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె షాప్ తో పాటు ఇంట్లోనూ తనిఖీచేసినా ఎక్కడా మద్యం లభించలేదు. చివరకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మద్యంబాటిల్స్ ఎక్కడ దాచిందీ ఆమెతోనే చెప్పించారు. భూమిలో గుంతతవ్వి అందులో మద్యం బాటిల్స్ దాచినట్లు తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. 

గ్రామ శివారులో నాగమణి భూమిలో దాచిన తెలంగాణ మద్యం బాటిళ్ళను పోలీసులు బయటకు తీయించారు. గుంతలోంచి నాగమణి ఒకటి తర్వాత ఒకటి మందు బాటిల్స్ తీయడం చూసి ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తంగా 90 తెలంగాణ, 10  ఆంధ్ర ప్రదేశ్ మద్యంబాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగమణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu