చంద్రబాబుకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఇవే...!

By SumaBala Bukka  |  First Published Nov 2, 2023, 10:45 AM IST

చంద్రబాబు నాయుడికి కంటి సమస్య ఒక్కటేనా? ఆయన ఆరోగ్యం రోజురోజుకీ ఎందుకు క్షీణించింది? ఏఏ ఆరోగ్య సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి? 


అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అనారోగ్య సమస్యల కారణంగా మద్యంతర బెయిలుపై విడుదలయ్యారు. ముఖ్యంగా ఆయనకు  కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని, చర్మ సంబంధిత వ్యాధులకు చికిత్స అవసరమని చెబుతున్నారు. అయితే,  ఇవేనా.. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు ఇంకా ఏమున్నాయి?  ఆ వివరాలు…

చంద్రబాబు వయసు 73 సంవత్సరాలు. ఆయన ఫిట్ గానే ఉన్నానని చెబుతున్నప్పటికీ వయసురీత్యా అనేక ఆరోగ్య సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి. ఈ మేరకు  వైద్యులు నివేదిక అందించారు. ముందుగా చంద్రబాబుకు అత్యవసరంగా చేయాల్సింది కంటి కాటరాక్ట్ ఆపరేషన్. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టుకు ముందు ఈ జూన్లో చంద్రబాబు నాయుడు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. 

Latest Videos

చంద్రబాబు సన్నిహితుల ఆస్తులు అటాచ్ మెంట్... సిఐడికి హోంశాఖ అనుమతి

హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగిన సమయంలోనే మూడు నెలల్లో కుడి కంటికి కూడా  ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. కానీ సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, జైలుకు వెళ్లడంతో ఆపరేషన్ తేదీ… దాటిపోయింది.  దీంతోనే కంటి సమస్యలు తీవ్రమయ్యాయని తెలుస్తోంది.

దీంతోపాటు.. చంద్రబాబుకు చాలాయేళ్లుగా చర్మ సంబంధిత సమస్యలు ఉన్నాయి.  జైలులో ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్ తో అవి మరింతగా పెరిగాయి. చంద్రబాబు వీపు, నడుము, చాతి, చేతులు,  గడ్డం తదితర ప్రాంతాల్లో  ఎర్రటి దద్దుర్లు,  పొక్కులు ఏర్పడ్డాయని దీంతో తీవ్రమైన దురద ఉందని  జిజిహెచ్ చర్మ సంబంధ వైద్య నిపుణులు తెలిపారు.

 ఇక చంద్రబాబు  రెండు అరచేతుల్లో చీమ పొక్కులు ఏర్పడి అవి చితికి పోవడం వల్ల దురద, శరీరం మొత్తం తెల్లటి పొక్కులు ఏర్పడ్డాయని.. కొన్ని ప్రాంతాల్లో వేడి కురుపులు కూడా ఏర్పడి ఇబ్బంది పడుతున్నారని జిజిహెచ్ వైద్య నిపుణులు  జైలు అధికారులకు ఇచ్చిన నివేదికలో తెలిపారు. ఈ కారణంగానే కోర్టు చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. ఏసీ ఏర్పాటుతో డిహైడ్రేషన్ తగ్గినా.. చర్మ సమస్యలు మాత్రం తగ్గలేదని  సమాచారం. 

మరోవైపు, ఇక చంద్రబాబుకు వెన్నునొప్పి కూడా బాధిస్తోందని తెలుస్తోంది. దీంతో ఆయనను పరీక్షించిన వైద్యులు ఒకే పొజిషన్  ఎక్కువసేపు కూర్చోవద్దని.. సౌకర్యవంతంగా ఉండే కూర్చునే వాడాలని తెలిపారు. దీంతోపాటు చంద్రబాబు మలద్వారం వద్ద కూడా నొప్పితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల నడుం కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నారు. మలవిసర్జన సరిగా లేకపోవండతో ఈ సమస్య ఏర్పటినట్టుగా చెబుతున్నారు. 

ఇవే కాకుండా బీపీ, షుగర్ లాంటి రెగ్యులర్ ఆరోగ్య సమస్యలు కూడా చంద్రబాబుకు ఉన్నాయి. దీంతోపాటు జైలుకు వెళ్లినప్పటినుంచి ఆయన బరువులో చాలా మార్పు వచ్చిందని, ఐదు కిలోల బరువు తగ్గారని, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాక్టోస్కోపీ చేయాలని కోరారు. 
 

click me!