చంద్రబాబు సన్నిహితుల ఆస్తులు అటాచ్ మెంట్... సిఐడికి హోంశాఖ అనుమతి

By Arun Kumar P  |  First Published Nov 2, 2023, 9:54 AM IST

ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును జైల్లోపెట్టి నైతికంగా దెెబ్బతీసిన సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల ముందు ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సిఐడి కీలక చర్యలకు సిద్దమయ్యింది. 


అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఇంటికి ఒకే కనెక్షన్ పేరుతో  కేబుల్ టివి, ఇంటర్నెట్, ఫోన్ సదుపాయం కల్పించేందుకు 2015 లో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్ పేరుతో ఆనాటి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భారీ అవినీతికి పాల్పడినట్లు వైసిపి ఆరోపిస్తోంది.  అధికారంలోకి రాగానే ఫైబర్ గ్రిడ్ పై సిఐడి విచారణకు ఆదేశించింది. 

తాజాగా పైబర్ గ్రిడ్ వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేసిన సిఐడి.  ఈ క్రమంలోనే ఈ స్కాం ద్వారా లబ్దిపొందిన మాజీ సీఎం చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు సిఐడి నిర్ణయం తీసుకుంది. ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలన్న ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం లభించింది. దీంతో ఆస్తుల అటాచ్ మెంట్ కు  సిద్దమయ్యింది సిఐడి. 

Latest Videos

చంద్రబాబు బినామీగా వైసిపి నాయకులు ఆరోపిస్తున్న వేమూరి హరికృష్ణప్రసాద్ కు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీ ఆస్తులను సిఐడి అటాచ్ చేయడానికి గుర్తించింది. 
గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమిని సిఐడి అటాచ్ చేయడానికి సిద్దమయ్యింది. ఇప్పటికే హోంశాఖ అనుమతి లభించి ఉత్తర్వులు కూడా వెలువడిన నేపథ్యంలో సిఐడి మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది. 

Read More చంద్రబాబు చల్లగా వుండాలనే కోరుకుంటున్నాం..: మంత్రి బొత్స సత్యనారాయణ

చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి కోసం సిఐడి విజయవాడ ఏసిబి కోర్టుకు వెళ్లింది. కోర్టు అనుమతి లభిస్తే ఆస్తుల అటాచ్ మెంట్ ప్రక్రియ ప్రారంభంకానుంది. 

అసలు ఏమిటి ఫైబర్ గ్రిడ్ స్కాం: 

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి ఇంటికి చౌకగా కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్ కల్పించడానికి గత టిడిపి ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి రాగానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. 2015 లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక ప్రకటన చేసారు. 

అయితే ఈ ఫైబర్ ప్రాజెక్ట్ ద్వారా చంద్రబాబు నాయుడు భారీ అవినీతికి పాల్పడినట్లు వైసిపి ఆరోపిస్తోంది. 2019 లో వైసిపి అధికారంలోకి రాగానే  సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్ట్ లో జరిగిన అవితీనిపై సిఐడి విచారణకు ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ లో రెండువేల కోట్ల అవినీతి జరిగిందని... చంద్రబాబు, లోకేష్ సన్నిహితులు దీని ద్వారా లబ్ది పొందినట్లు  సిఐడి ఆరోపిస్తోంది. దీనిపై దర్యాప్తు సాగిస్తున్న సిఐడి తాజాగా చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు సిద్దమయ్యింది. 

  

click me!