రేవంత్ వ్యవహారం తేలిపోతుందా ?

First Published Oct 27, 2017, 11:03 AM IST
Highlights
  • తెలుగుదేశంపార్టీ నేతల్లో ఉత్కంఠ మొదలైంది.
  • రేవంత్ రెడ్డి ఉదంతంతో రోడ్డుమీద పడిన తెలుగుదేశంపార్టీ వ్యవహారాలపై టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ చంద్రబాబునాయుడుకు శుక్రవారం వివరించారు.
  • విదేశాల నుండి వచ్చిన చంద్రబాబును రమణ్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో కలిసారు.

తెలుగుదేశంపార్టీ నేతల్లో ఉత్కంఠ మొదలైంది. రేవంత్ రెడ్డి ఉదంతంతో రోడ్డుమీద పడిన తెలుగుదేశంపార్టీ వ్యవహారాలపై టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ చంద్రబాబునాయుడుకు శుక్రవారం వివరించారు. విదేశాల నుండి వచ్చిన చంద్రబాబును రమణ్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో కలిసారు. జరిగిన విషయాలను పూసగుచ్చినట్లు వివరించారు. దాంతో పది రోజులుగా రెండు రాష్ట్రాల్లోని టిడిపి నేతలను టెన్షన్ పెడుతున్న రేవంత్ రెడ్డి ఇష్యూ శుక్రవారం క్లైమ్యాక్స్ కు చేరుకుంటుందని అనుకుంటున్నారు.

ఎందుకంటే, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఈరోజు సాయంత్రానికి విజయవాడకు  చేరుకుంటారు. కాబట్టి తెలంగాణా టిడిపి నేతలతో పాటు పలువురు ఏపి నేతలను కూడా సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబు కార్యాలయం నుండి ఆదేశాలు అందాయి.

సాయంత్రం సమావేశానికి ఉభయ రాష్ట్రాల్లోని నేతలతో పాటు రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. సమావేశానికి రావాల్సిందిగా మిగిలిన నేతలకు సమాచారం ఇచ్చినట్లే రేవంత్ కు కూడా చెప్పారు. అయితే, రేవంత్ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది తెలీదు.

టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, టిటిడిఎల్పీ అధ్యక్ష బాద్యతల నుండి రేవంత్ ను చంద్రబాబు తప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. బాధ్యతల నుండి తప్పించినా రేవంత్ మాత్రం పలువురు నేతలకు సంబంధించి తన వాదనకే కట్టుబడి ఉన్నారు. దాంతో సమావేశంలో ఎవరేమి మాట్లాడుతారో ? అన్న విషయాలపై ఏపి టిడిపి నేతల్లో తీవ్ర ఉత్కంఠ మొదలైంది.

click me!