నంద్యాలలో ప్రధాన పార్టీలకు తలనొప్పే

First Published Jun 28, 2017, 12:37 PM IST
Highlights

కొంతకాలంగా రాయలసీమ హక్కులని, రాయలసీమ జలాలని కాస్త హడావుడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా? ఈ పరిస్ధితిల్లో కొన్ని వందల ఓట్లు చీలినా గెలుపోటముల్లో భారీ తేడాను కొట్టేస్తుంది. మరి, ఉపఎన్నికలో బైరెడ్డి ప్రభావం ఎంతుంటుందో, ఆయనతో కలిసివచ్చే పార్టీలేమిటో చూడాల్సిందే.

రాయలసీమ ఉద్యమనేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా నంద్యాల ఉపఎన్నికల బరిలోకి దూకుతున్నారు. కలిసి వచ్చే పార్టీలతో జట్టు కట్టి అభ్యర్ధిని పోటీలో నిలుపనున్నట్లు ప్రకటించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, టిడిపి, వైసీపీల విధానాలను ప్రజలోకి తీసుకెళతారట. టిడిపిలో నుండి వైసీపీలో చేరిన వెంటనే వైసీపీ అధినేత శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వటాన్ని ఆక్షేపించారు.

నంద్యాల ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పటం కష్టం. రెండు ప్రధాన పార్టీలూ ఎన్నికలో గెలవటాన్ని ప్రతిష్టగా తీసుకున్నాయి. చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని నిరూపించాలన్నది జగన్ ఆలోచన. అదే విధంగా తమ ప్రభుత్వానికి ప్రజల మద్దతుందని తెలియజెప్పాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలో గెలుపుకు రెండు పార్టీలూ ఏ స్ధాయిలో పోరాటం చేస్తాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

అటువంటి నేపధ్యంలో బైరెడ్డి చేసిన ప్రకటన రెండు పార్టీలకు కొద్దిగా తలనొప్పి కలిగించేవే. ఎందుకంటే, బైరెడ్డి కూడా స్వయంగా కర్నూలు జిల్లాకు చెందిన నేతే కావటం, కొంతకాలంగా రాయలసీమ హక్కులని, రాయలసీమ జలాలని కాస్త హడావుడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా? ఈ పరిస్ధితిల్లో కొన్ని వందల ఓట్లు చీలినా గెలుపోటముల్లో భారీ తేడాను కొట్టేస్తుంది. మరి, ఉపఎన్నికలో బైరెడ్డి ప్రభావం ఎంతుంటుందో, ఆయనతో కలిసివచ్చే పార్టీలేమిటో చూడాల్సిందే.

click me!