
తెలుగుదేశంపార్టీ నంద్యాల ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంతో తాయిలాలను సిద్దం చేస్తోంది. ఉపఎన్నికలో గెలుపు బాధ్యతను మంత్రులు నారాయణ, కాల్వ శ్రీనివాసులపై మోపారు చంద్రబాబునాయుడు. దాంతో నారాయణ నంద్యాలలోనే క్యాంపు వేసారు. గడచిన మూడేళ్ళలో నంద్యాలను పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం తాజాగా 120 రోజుల ప్రణాళిక అంటూ నియోజకవర్గంలో ఊదరగొడుతోంది. ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటన వెలువడేలోగానే ఓటర్లకు, సామాజిక వర్గంలోని ముఖ్యులకు తాయిలాల పంపిణీకి రంగం సిద్దం చేస్తున్నారు నారాయణ.
ఇందులో భాగంగానే, శిల్పా వర్గానికి చెందిన వారిని జన్మభూమి కమిటీల నుండి, రేషన్ షాను డీలర్ల స్ధానం నుండి తొలగించి, తమ వారిని నియమిస్తున్నారు. నంద్యాల, గోస్పాడు మండలాలపై దృష్టి పెట్టిన మంత్రి బిసి మహిళలకు 3 వేల కుట్టుమిషన్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా బలిజ సామాజికవర్గంలోని మహిళలకు కూడా మరో 1500 కుట్టుమిషన్లు పంపిణీకి సిద్ధం చేసారు.
బిసి సామాజిక వర్గాల్లోని ముఖ్యులను గుర్తించి వారిలో కొందరికి బిసి కార్పొరేషన్ ద్వారా కార్లు, ట్రాక్టర్లను ఇప్పించేందుకు జాబితా రెడీ చేస్తున్నారట. నియోజకవర్గంలోని వివిధ సామాజికవర్గాలకు చెందిన ముఖ్యుల జాబితాను రూపొందించి వారిని ఆయా కులాలకు చెందిన నేతలతో మాట్లాడిస్తున్నారు. అంటే షెడ్యూల్ విడుదలయ్యేలోగా ప్రతీ సామాజికవర్గాన్ని ఏదో విధంగా బుట్టలో వేసుకునేందుకు టిడిపి ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. దీనిబట్టే నంద్యాల గెలుపును చంద్రబాబు ఎంత ప్రతిష్టగా తీసుకున్నారో అర్ధమైపో