మహారాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు కదా?

First Published Jun 25, 2017, 10:50 AM IST
Highlights

దేశంలోనే రైతురుణమాఫీ చేసిన ఘనత తమదే అని చెప్పుకునే చంద్రబాబు కూడా మంత్రులు, ఎంఎల్ఏల జీతబత్యాలను విరాళంగా ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చుకదా? 

రుణమాఫీ విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటుందా? మార్గద్శకమంటే రుణమాఫీ పథకం అమలు తీరును కాదు. రైతు లబ్దిదారుల సంఖ్య, రుణమాఫీ మొత్తం తదితరాల జోలికి వెళ్ళటం అనవసరం. మహారాష్ట్ర ప్రభుత్వంపైన పడే ఆర్ధిక భారాన్ని అక్కడి మంత్రులు, ఎంఎల్ఏలు ఒక నెల జీతాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇస్తారట.

దేశంలోనే రైతురుణమాఫీ చేసిన ఘనత తమదే అని చెప్పుకునే చంద్రబాబు కూడా మంత్రులు, ఎంఎల్ఏల జీతబత్యాలను విరాళంగా ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చుకదా? మన రాష్ట్రంలో 175 మంది ఎంఎల్ఏలున్నారు. అందులోనే 26 మంది మంత్రులు కూడా ఉన్నారనుకోండి. వీరుకాకుండా 58 మంది శాసనమండలి సభ్యులున్నారు. వీరికి అదనంగా పార్లమెంట్ సభ్యులున్నారు. వీరి జీతబత్యాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి.

వీరందరూ కాకుండా ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ ఛైర్యన్లు ఉండనే ఉన్నారు. వీరికి నెలకు సుమారు రూ. 2 లక్షల జీతాలున్నాయి. అంటే మొత్తం మీద ప్రభుత్వానికి నెలకు సుమారు రూ. 10 కోట్లదాకా జీత,బత్యాలకే వ్యయం అవుతోంది. ఈ లెక్కన ఏడాదికి రూ. 120 కోట్లంటే రెండేళ్ళకు రూ. 240 కోట్లు. ఇదేమంత చిన్న మొత్తం కాదుకదా?

తమ ప్రజాప్రతినిధుల జీతాన్ని విరాళంగా ఇచ్చే విషయంలో చంద్రబాబునాయుడు ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడితే బాగుంటుంది కదా? ఇస్తే ఒకనెల జీతం లేకపోతే మిగిలిన 24 నెలల జీత, బత్యాలను ప్రభుత్వానికే ఇచ్చేస్తే ఎంతోకొంత ప్రభుత్వానికి ఆర్ధికభారం తగ్గించిన వారౌతారు.

click me!