షాపింగ్‌మాల్‌‌లో ఉద్యోగం: అనుమానంతో భార్యను నరికిన భర్త

sivanagaprasad kodati |  
Published : Dec 13, 2018, 02:03 PM IST
షాపింగ్‌మాల్‌‌లో ఉద్యోగం: అనుమానంతో భార్యను నరికిన భర్త

సారాంశం

షాపింగ్ మాల్‌లో ఉద్యోగం చేసే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. నెల్లూరు జిల్లా కలివేలపాలెం గ్రామానికి చెందిన ఓజిలి గోపాల్, లక్ష్మీ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. 

షాపింగ్ మాల్‌లో ఉద్యోగం చేసే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. నెల్లూరు జిల్లా కలివేలపాలెం గ్రామానికి చెందిన ఓజిలి గోపాల్, లక్ష్మీ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు..

లక్ష్మీ నెల్లూరు నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని గోపాల్ అనుమానించడం మొదలుపెట్టాడు. దీంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

అప్పటికి కామ్ అయిపోయిన గోపాల్ తెల్లవారుజామున నిద్రిస్తున్న లక్ష్మీపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె కేకలు వేసింది.. లక్ష్మీ అరుపులు విన్న చుట్టుపక్కల వారు పరుగు పరుగున రావడంతో గోపాల్ అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడివున్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మీ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోపాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సీన్ రివర్స్: ప్రియుడిని పెళ్లాడాలని...భార్యను చంపిన భర్త

ఆర్నెళ్ల క్రితం లవ్ మ్యారేజ్: పుట్టింట్లో ఉన్న భార్యను చంపిన భర్త

మద్యం మత్తులో దారుణం..రూ.500కోసం భార్యను చంపిన భర్త

భార్యను చంపిన భర్త: తండ్రికి షాకిచ్చిన మూడేళ్ల కొడుకు, ఏమైందంటే?

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను చంపిన భర్త

PREV
click me!

Recommended Stories

నది కాలుష్యం పై అధికారులకి చెమటలు పట్టించిన పవన్ | Pawan Kalyan Inspects Pollution | Asianet Telugu
Deputy CM Pawan Kalyan: ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ రియాక్షన్ | Asianet Telugu