పార్లమెంటు సమావేశాలు: మళ్లీ మొదలైన శివప్రసాద్ 'వేషాలు'

By Nagaraju TFirst Published Dec 13, 2018, 12:47 PM IST
Highlights

సినీనటుడు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అంటే తెలియని వారుండరు. పరిచయం అక్కర్లేని వ్యక్తి. సినీనటుడిగా ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఆయన చేసే నిరసనల ద్వారా మాత్రం జాతీయ స్థాయిలో పేర్గాంచారు. శివప్రసాద్ వేషాలకు జాతీయ నేతలు సైతం ఫిదా అయ్యారు. 
 


ఢిల్లీ: సినీనటుడు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అంటే తెలియని వారుండరు. పరిచయం అక్కర్లేని వ్యక్తి. సినీనటుడిగా ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఆయన చేసే నిరసనల ద్వారా మాత్రం జాతీయ స్థాయిలో పేర్గాంచారు. శివప్రసాద్ వేషాలకు జాతీయ నేతలు సైతం ఫిదా అయ్యారు. 

ప్రధాని నరేంద్రమోదీపైనా, కేంద్రప్రభుత్వ తీరును ఎండగడుతూ పార్లమెంట్ ఆవరణలో శివప్రసాద్ తన వేషధారణలతో నిరసన తెలపడానికి ముగ్ధురాలయ్యారు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ. అంతేకాదు సమావేశాల నుంచి బయటకు వచ్చి శివప్రసాద్ ను అభినందించడంతోపాటు ఓ సెల్ఫీకూడా దిగారు.

చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వేసే వేషాల్లో ఎంతో గూడర్థం దాగి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలకు తగ్గుట్లుగా వేషధారణ వేసి అందర్నీ ఆలోచింప జేస్తున్నారు. అంతేకాదు తిట్టనవసరం లేకుండా తన వేషధారణతో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. 

ముఖ్యంగా రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలలో మోసాలు, కుట్రలు వంటి పాత్రధారుల వేషాలు వేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అలా ఏపీకి ప్రధాని మోదీ నమ్మించి మోసాలు చేశారంటూ ఆరోపిస్తున్నారు. అలా ఆయన వేసే ఓక్కో వేషానికి ఓక్కో ప్రాధాన్యత ఉండటంతో అంతా ఆయన వేషాలను తిలకిస్తున్నారు.

తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో మళ్లీ విచిత్ర వేషధారణలు వెయ్యడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు నిరసనలకు దిగుతున్నారు. 

ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలుపుతుంటే శివప్రసాద్ మాత్రం గారడీ వేషధారణతో నిరసన తెలుపుతున్నారు. గారడి వేషధారణలో పార్లమెంట్‌ ఆవరణలో నిరసనకు దిగారు. 

పొట్టకూటి కోసం మాయలు చేసే వాడు గారడీ వాడైతే ..మోదీ ఓట్లు, పదవుల కోసం మాయలు చేసేవాడని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని మాయమయ్యారని ఎంపీ శివప్రసాద్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 

click me!