Asianet News TeluguAsianet News Telugu

సీన్ రివర్స్: ప్రియుడిని పెళ్లాడాలని...భార్యను చంపిన భర్త

వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డుగా ఉన్న భార్యలను భర్తలు.. మొగుళ్లను పెళ్లాలు అత్యంత దారుణంగా చంపుతున్న ఘటనలు మనం రోజూ చూస్తునే ఉన్నాం. అయితే ఇక్కడ విచిత్రమైన సంఘటన జరిగింది. 

Same-sex marriage: husband kills wife in UK
Author
London, First Published Dec 5, 2018, 10:25 AM IST

వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డుగా ఉన్న భార్యలను భర్తలు.. మొగుళ్లను పెళ్లాలు అత్యంత దారుణంగా చంపుతున్న ఘటనలు మనం రోజూ చూస్తునే ఉన్నాం. అయితే ఇక్కడ విచిత్రమైన సంఘటన జరిగింది. మగాన్ని ప్రేమించిన మరో మగాడు.. అతన్ని పెళ్లడటానికి అడ్డుగా ఉన్న భార్యను కడతేర్చాడు.

వివరాల్లోకి వెళితే.... భారత సంతతికి చెందిన జెస్సికా, మితేష్‌లకు మాంచెస్టర్‌ వర్సిటీలో చదివే రోజుల్లో స్నేహం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట బ్రిటన్‌ మిడిల్స్‌బోరోలో స్థిరపడింది..

అనంతరం మూడేళ్లుగా తమ ఇంటికి సమీపంలోనే మందుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో జెస్సికా అనుమానాస్పద స్థితిలో మరణించింది. కేసు విచారణలో భాగంగా పోలీసులకు మితేష్‌పై అనుమానం కలిగింది.. అతడిని అదుపులోకి తీసుకుని ఆరా తీయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

మితేష్‌కు డేటింగ్ యాప్ ద్వారా 2015లో సిడ్నీకి చెందిన అమిత్ పటేల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు గే కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలో అతడిని పెళ్లాడాలని భావించిన మితేష్ భార్యను అడ్డు తొలగించుకోవాలని కుట్రపన్నాడు.

జెస్సికాతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూనే భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అమిత్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్ట్రేలియాలోనే స్థిరపడాలని భావించాడు. అందుకు కావాల్సిన డబ్బు కోసం భార్య పేరిట రెండు మిలియన్ పౌండ్ల ఇన్సూరెన్స్ కూడా చేయించాడు.

ప్లాన్‌లో భాగంగా ఓ రోజు జెస్సికా దుకాణం నుంచి ఇంటికి రాగానే ఆమెతో వాదనకు దిగాడు. అనంతరం ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ప్లాస్టిక్ కవర్‌తో ముఖాన్ని బిగించాడు. ఊపిరందక పోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు మితేష్ తెలిపాడు.

భార్యను ఎంతగానో ప్రేమించే మితేష్ ఆమెను హత్య చేశాడంటే కుటుంబసభ్యులు, స్థానికులు నమ్మలేకపోతున్నారు. హత్యకు ముందు ఇన్సులిన్ ఓవర్‌డోస్ ఒక మనిషిని చంపడానికి ఎంత మెథడాన్ అవసరమవుతుందనే దానిపై మితేష్ ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు మితేష్ 2011 నుంచి గే డేటింగ్ యాప్‌లో ప్రిన్స్ అనే మారు పేరుతో ఛాటింగ్ చేసేవాడని, ఈ విషయం ఫార్మసీలో అందరికీ తెలిసినప్పటికీ వారు రహస్యంగా ఉంచడంతో ఈ విషయం జెస్సికా దృష్టికి వచ్చిందని ఆమె తరపు లాయర్ పేర్కొన్నారు. భార్యను హత్య చేసిన నేరం కింద న్యాయమూర్తి మితేష్‌కు ఉరిశిక్ష విధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios