పక్కింటి వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం... తట్టుకోలేక ఆ భర్త చేసిన పని...

Published : Nov 01, 2021, 08:27 AM IST
పక్కింటి వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం... తట్టుకోలేక ఆ భర్త చేసిన పని...

సారాంశం

ఇంటి పక్క వాటా లో ఏం రమేష్ కుటుంబం నివాసం ఉంటుంది.  రమేష్ నగరంలోని ఓ బార్లో పని చేస్తున్నాడు.  రమేష్ భార్యతో  దుర్గా ప్రసాద్ కు extramarital affair నడుస్తోంది.ఆ విషయం రమేష్ కు తెలియడంతో గొడవలు జరుగుతున్నాయి.  

రాజమహేంద్రవరం :  వివాహేతర బంధం రాజమహేంద్రవరంలో శనివారం  ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది.  మూడో పట్టణ సీఐ  మధు బాబు తెలిపిన వివరాల ప్రకారం…  బొమ్మూరు  బత్తిన నగర్ కు చెందిన  దుర్గాప్రసాద్ (35)  నగరంలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ లో పని చేస్తున్నాడు.

ఇతనికి వివాహమై,  భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.  ఇతని ఇంటి పక్క వాటా లో ఏం రమేష్ కుటుంబం నివాసం ఉంటుంది.  రమేష్ నగరంలోని ఓ బార్లో పని చేస్తున్నాడు.  రమేష్ భార్యతో  దుర్గా ప్రసాద్ కు extramarital affair నడుస్తోంది. ఇలాంటి విషయాలు ఎక్కువ రోజులు దాగవు. అది ఆ నోటా, ఈ నోటా రమేష్ కు తెలిసింది. దీంతో కోపంతో ఊగిపోయాడు.

ఆ విషయం రమేష్ కు తెలియడంతో గొడవలు జరుగుతున్నాయి.  వారం కిందట రమేష్ భార్య, పిల్లలను పుట్టింటికి పంపించాడు.  దుర్గాప్రసాద్ murder చేయాలని నిర్ణయించుకున్నాడు.  ఆదివారం దేవి చౌక్ ప్రాంతానికి వచ్చిన దుర్గాప్రసాద్ ను  వెంబడించి లింగంపేట వాంబే కాలనీ వద్ద knifeతో మెడపై పలుమార్లు దాడి చేసి పరారయ్యాడు.

ప్రియుడితో రాసలీలలు: లవర్‌తో కలిసి భర్తను చంపిన భార్య

ఈ దాడితో తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఈ దారుణాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు వెంటనే దుర్గాప్రసాద్ ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. 

విషయం ఆరా తీయగా, రమేష్ ఈ హత్య చేసినట్లు తెలిసింది. రమేష్ కోసం వలపన్నిన పోలీసులు సాయంత్రం రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో రమేష్ కు మరో ఇద్దరు సహకరించినట్లు భావిస్తున్నామని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.

ఇలాంటి ఘటనల్లో భార్యభర్తల్లో ఎవరో ఒకరు తప్పుచేయడం.. మరొకరు హతులుగానో, నేరస్తులుగానో మారడం జరుగుతుంది. ఇలాంటి సంబంధాలు అంతిమంగా సంసారాలను చిధ్రం చేస్తాయి. గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకొన్నాయి. 

వివాహేతర సంబంధం ఘటనలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని స్వాతి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. తన భర్తను హత్య చేసిన భార్య ప్రియుడిని తన భర్త స్థానంలోకి తీసుకురావాలని ప్రయత్నించింది.

అంతర్వేదిలో రూ. 2.60 లక్షలు పలికిన కచిడి మగ చేప.. ఆ చేపకు అంతా డిమాండ్ ఎందుకంటే..?

అయితే ఈ విషయమై అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు శాస్త్రీయమైన ఆధారాలతో ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు.. ఈ కేసులో స్వాతి సహా ఆమె ప్రియుడు రాజేష్ అరెస్టయ్యారు. మరో వైపు స్వాతి తన భర్తను ప్రేమించి పెళ్లి చేసుకొంది. 

అయితే ప్రియుడి మోజులో పడి ఆమె భర్తను హత్యచేసింది. ఈ ఘటన సినిమాను పోలి ఉండడంతో పెద్ద సంచలనంగా మారింది.. స్వాతిని తమ కూతురుగా కూడా చెప్పుకొనేందుకు తల్లిదండ్రులు ఇష్టపడమని తెగేసీ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu