విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం కూర్మన్నపాలెంలో నిర్వహించిన సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సభలో వైసీపీపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు.
విశాఖపట్టణం:విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకొనేందుకు ఏం చేస్తారో వారం రోజుల్లో ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన చేయాలని jana Sena చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.ఈ విషయమై అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు.లేకపోతే విశాఖస్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి తాము అండగా నిలుస్తామని Jana sena చీఫ్ pawan Kalyan చెప్పారు. వచ్చే రెండేళ్ల పాటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ జిల్లాల వరకు ఉద్యమాన్ని తీసుకెళ్లాలని ఆయన కార్మిక సంఘాలను కోరారు. ఈ ఉద్యమం వెనుక తాను అండగా ఉంటానని ఆయన హమీ ఇచ్చారు.
also read:మేం డూడూ బసవన్నల౦ కాదు: బీజేపీని ఉద్దేశిస్తూ జనసేన నేత సంచలన వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు విశాఖలోని కూర్మన్నపాలెంలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మహా ప్రస్థానంలోని శ్రీశ్రీ కవితల్లో కొన్ని వ్యాఖ్యలు, గుంటూరు శేషేంద్ర శర్మ కవితల్లో మరికొన్ని పంక్తులను ప్రస్తావిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.పీడితుల పక్షాన నిలబడనప్పుడు ఆ జన్మ వృధా అని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకుడు ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.ఏ పరిశ్రమకు నష్టాలు లేవో చెప్పాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎవరో పడేస్తే రాలేదన్నారు. పోరాటం సాధించుకొన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ ఫ్యాక్టరీ కోసం ఎందరో పోరాటాలు చేశారన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం ఆంధ్రు ఆత్మగౌరవమన్నారు.
Visakha steel ఆంధ్రుల హక్కు అని ఆయన మరోసారి నినదించారు ఆనాడు విశాఖ ఉక్కు కోసం జరిగిన పోరాటం గురించి ఈ తరం యువత తెలుసుకోవాల్సిన అవఃసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.1971లో విశాఖ ఉక్కుకు శంకుస్థాపన చేస్తే, 1992లో ఈ పరిశ్రమను జాతికి అంకితం చేసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 32 మంది యువకులు బలిదానం చేసుకొన్నారని ఆయన గుర్తు చేశారు.
ఆంధ్రవాళ్లకు మా కులం అన్న దరిద్రం ఉంటుందన్నారు. కానీ కులాలు, మతాలకు అతీతంగా ఒకే ఒక్క నినాదం రాష్ట్రాన్ని కుదిపేసిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చేందుకు కుల,మతాలకు అతీతంగా ఎందరో కృషి చేశారని చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వారికి ఇంతవరకు పరిహారం అందలేదన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అంశం ఆంధ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశంగా ఆయన పేర్కొన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్త వినగానే తనకు చాలా బాధ కలిగిందని చెప్పారు. రెండు దశాబ్దాల కాలంలో ఈ ఫ్యాక్టరీ రూ. 6 వేల కోట్ల లాభాన్ని ఆర్జించిందన్నారు. 16 వేల మందికి నేరుగా ఉద్యోగం, 18 వేల మంది కాంట్రాక్టు లేబర్ కు ఉపాధి కల్పించిందని చెప్పారు.
మీ బలం ఉందనే అమిత్ షా అపాయింట్ మెంట్
నాకు ప్రజా బలం ఉందనే కేంద్ర మంత్రి అమిత్ షా తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించవద్దని తాను కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించినట్టుగా చెప్పారు.ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులు, ప్రజల సెంటిమెంట్ ను తాను అమిత్ షాకు వివరిస్తే సావధానంగా విన్నారని ఆయన ఈ సభలో గుర్తు చేసుకొన్నారు.
తనకు ఎంపీలు లేరు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేని వైసీపీ వాళ్లు పట్టుకొనిపోయారన్నారు. అయితే ప్రజల బలం ఉందనే కారణంగా తనకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారన్నారు. 22 మంది ఎంపీలున్న వైసీపీ . వైసీపీ ఎంపీలు పార్లమెంట్ కు వెళ్లేది కబుర్లు చెప్పుకోవడానికి, కాఫీలు తాగడానికా అని ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అడిగే ధైర్యం వాళ్లకు ఎందుకు లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం లేఖలు రాశామని వైసీపీ చెబుతుందన్నారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో మీ లేఖలు చూడలేదా అని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం రాజీనామాలు చేస్తామన్నారు.. ఇప్పటివరకు ఎందుకు రాజీనామాలు చేయలేదని ఆయన వైసీపీ ఎంపీలను ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వైసీపీ మాటల్ని నమ్మడం లేదన్నారు.
వైసీపీ మాటలకు అర్ధాలే వేరు
వైసీపీ నాయకుల మాటలకు అర్ధాలే వేరులేనని ఆయన సెటైర్లు వేశారు.సంపూర్ణ మద్య నిషేధం అంటే మద్యం సంపూర్ణంగా అమ్ముతారని అర్ధమన్నారు పవన్ కళ్యాణ్.విద్యార్ధులకు అండగా నిలబడతామంటే అన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలను మూసేసి విద్యార్ధులను రోడ్డు పాడేస్తారని అర్ధమని ఆయన చెప్పారు. రైతులకు రూ. 12,500 ఇస్తామంటే కేంద్రం ఇచ్చే రూ. 6 వేలతో కలిపి అని అర్ధం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. కోవిడ్ తో చస్తున్నామంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలని చెబుతారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే జాబ్ లు తీసేస్తామని అర్ధమని ఆయన విమర్శించారు.నష్టాలు రాని పరిశ్రమ ఏదైనా ఉందంటే అది Ycp రాజకీయ పరిశ్రమేనని వపన్ కళ్యాణ్ విమర్శించారు. ఉక్కు సంకల్పంతో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.