భర్త మరణ వార్త విని.. కుప్పకూలిన భార్య.. చివరికి...

By AN TeluguFirst Published Oct 6, 2021, 10:57 AM IST
Highlights

భర్త మరణవార్త విని భార్య మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..  బల్లికురవ మండలం చిన్న అంబడిపూడి చెందిన చిన్న పాపారావు (61), భార్య రమాదేవి (57) కు కుమారుడు చంద్రశేఖర్,  కుమార్తె సునీత  ఉన్నారు.

ఒంగోలులో విషాదం చోటుచేసుకుంది. జీవితాంతం కలిసి నడుస్తానన్న భర్త ఆకస్మాత్తుగా మరణించడంతో ఆ విషాదాన్ని తట్టుకోలేక భార్య కూడా అక్కడి కక్కడే గుండె పగిలి మరణించింది. దీంతో విషయం తెలిసినవారంతా దు:ఖ సాగరంలో మునిగిపోయారు. 

భర్త మరణవార్త విని భార్య మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..  బల్లికురవ మండలం చిన్న అంబడిపూడి చెందిన చిన్న పాపారావు (61), భార్య రమాదేవి (57) కు కుమారుడు చంద్రశేఖర్,  కుమార్తె సునీత  ఉన్నారు.

కుమార్తెను అదే గ్రామంలోని మేనల్లుడు రమేష్ బాబు కు ఇచ్చి వివాహం చేశారు.  కుమార్తె,  అల్లుడు గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని  గణపవరంలో ఉంటున్నారు. కుమారుడు చంద్ర శేఖర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ చెన్నైలో ఉంటున్నాడు.  పాపారావు దంపతులు అనారోగ్యంతో బాధపడుతూ గ్రామంలో ఉండడంలేదు.  వీరిద్దరు చెరి కొద్ది రోజులు పిల్లల దగ్గర ఉంటున్నారు.

అలా పదిహేను రోజుల క్రితమే చెన్నై నుంచి భార్య భర్తలు వచ్చి కుమార్తె దగ్గర ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున  తనకు ఒంట్లో బాగా లేదని paparao చెప్పడంతో అతని వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్తున్నారు.  ఇంతలో మార్గమధ్యంలోనే వేకువజామున 3 గంటల సమయంలో పాపారావు చనిపోయాడు.

అపార్ట్ మెంట్ మీదినుంచి దూకి.. ఎనిమిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి !

 పాపారావు చనిపోయిన విషయం  ఉదయం 5 గంటల సమయంలో ఇంటి దగ్గర ఉన్న అతని భార్య రమాదేవికి చెప్పారు.  ఆ వార్త విన్న రమాదేవి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.  ఆమెను హుటాహుటిన చిలకలూరిపేట లోని  ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా..  అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

 రెండు గంటల వ్యవధిలోనే  భార్య,భర్త  ఇద్దరు  రూచనిపోవడంతో  ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను చిన్న అంబడిపూడి తీసుకువచ్చి  గ్రామంలో  అంత్యక్రియలు నిర్వహించారు.  వైఎస్ఆర్సిపి గ్రామ నాయకుడిగా  పాపారావుకు పేరుంది.  వైఎస్సార్సీపీ మండల కన్వీనర్  చింతల పేరయ్య.  పలు గ్రామాల సర్పంచులు,  ఎంపీటీసీలు  పాపారావు, రమాదేవి మృతదేహాలకు నివాళులర్పించారు. 

click me!