ఇంద్రకీలాద్రిపై అపశృతి... శరన్నవరాత్రికి ఏర్పాట్లుచేస్తుండగా కరెంట్ షాక్, కార్మికుడు మృతి

By Arun Kumar PFirst Published Oct 6, 2021, 9:56 AM IST
Highlights

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో అపశృతి చోటుచేసుకుంది. శరన్నవరాత్రి ఏర్పాట్లు చేస్తుండగా ఓ కార్మికుడు ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయాడు. 

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిదిలో నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఓ కార్మికుడు కరెంట్ షాక్ కు గురయి ప్రాణాలు కోల్పోయాడు.  

నవరాత్రి సందర్భంగా భారీగా భక్తులు indrakeeladri kanakadurga అమ్మవారి దర్శనానికి రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆలయ అధికారులు భావించారు. ఇందులోభాగంగా క్యూలైన్ ఏర్పాట్లు ఓ టెంట్ హౌస్ కు అప్పగించారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున క్యూలైన్ సంబంధించిన సామాగ్రిని తీసుకు వస్తుండగా ప్రమాదం జరిగింది.  

read more  Navratri: దేవి నవరాత్రి సందర్భంగా దర్శించుకోవాల్సిన తొమ్మిది పుణ్యక్షేత్రాలు ఇవే!

సామాగ్రిని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు విద్యుత్ తీగలను తాకాడు. దీంతో కరెంట్ షాక్ కు గురయి కార్మికుడు బంటు సతీష్ అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకుని వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కార్మికుడు మరణించాడు. 

కార్మికుడి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

click me!