ఇదేం విడ్డూరం.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య..

Published : Sep 22, 2022, 10:49 AM IST
ఇదేం విడ్డూరం.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య..

సారాంశం

ఓ భార్య షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అది అందరినీ ఆశ్చర్యపరిచింది. తన భర్తకు అతని ప్రియురాలితో దగ్గరుండి మరీ పెళ్లి జరిపించింది. ఇదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

తిరుపతి :  ఓ భార్య తన భర్త ప్రేమించిన మహిళతో అతనికి వివాహం చేసింది. అంతేకాదు దగ్గరుండి మరీ వారిద్దరినీ తయారుచేసి పెళ్లి చేయడంతో అది చూసిన అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

టిక్ టాక్ లో ఏర్పడిన ప్రేమ వ్యవహారంలో ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి రెండోపెళ్లి చేయడం తిరుపతిజిల్లా డక్కిలి మండలంలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక అంబేద్కర్ నగర్ కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదివాడు. టిక్ టాక్ లో రాణిస్తున్న అతడికి మొదట విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. తర్వాత ఆమె నుంచి దూరమయ్యాడు. ఆపై టిక్ టాక్ లోనే పరిచయం అయిన కడపకు చెందిన మరో యువతిని పెళ్ళి చేసుకున్నాడు.

లక్ష రూపాయల కోసం అమ్మమ్మను చంపిన మనవడు

కొన్నాళ్లు వేచి చూసిన విశాఖ యువతి తిరుపతికి రావడంతో అతనికి పెళ్లి అయిన విషయం తెలిసింది. అయినా ఆమె నిరాశ పడకుండా.. ఆ యువకుడి భార్యతో మాట్లాడి తానూ ఇక్కడే ఉంటానని, అంతా కలిసి ఉందామని చెప్పడంతో ఆమె మొదటి అయోమయం చెందింది. చివరకు ముగ్గురూ కలిసి ఉండడానికి ఒప్పుకొని తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేయడానికి సిద్ధపడింది. దీతో వారి వ్యవహారం పెళ్లి పీటల వరకు చేరింది. దగ్గరుండి భర్త, ప్రియురాలిని అలంకరించి బుధవారం పెళ్లి చేసింది. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే సెప్టెంబర్ 13న ఒడిశాలో చోటు చేసుకుంది. పెళ్లయిన మగవాడు వేరే మహిళను ప్రేమించినా, వివాహేతర సంబంధం పెట్టుకున్నా ఆ కుటుంబంలో తీవ్ర అలజడి చెలరేగుతుంది. కలహండి జిల్లా నర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని డోర్ కుట్ గ్రామంలో ఇందుకు భిన్నమైన ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఫకీర్ నియాల్ కు అయిదేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. 

యేడాది క్రితం ఆయన గ్రామానికి చెందిన సంగీత అనే హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య ఆ హిజ్రాతో మాట్లాడి తన భర్తతో ఆదివరం సంప్రదాయ బద్ధంగా గ్రామంలోని ఆలయంలో పెళ్లి చేయించింది. తాను ఫకీరును ప్రేమించానని, ఆయన భార్య కొత్త జీవితం ప్రసాదించిందని, ఇప్పుడు నా కోసం ఒక కుటుంబం ఉందనే ఆనందం వ్యక్తం చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chitha Vijay Prathap Reddy: ఫుడ్ కమిషన్ చైర్మన్ కే పంచ్ లు నవ్వు ఆపుకోలేకపోయిన అధికారులు| Asianet
Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu