యలమంచిలి బావిలో జంట మృతదేహలు: పోలీసుల దర్యాప్తు

Published : Sep 22, 2022, 10:15 AM ISTUpdated : Sep 22, 2022, 11:01 AM IST
యలమంచిలి బావిలో జంట మృతదేహలు: పోలీసుల దర్యాప్తు

సారాంశం

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని యలమంచిలిలోని వ్యవసాయబావిలో జంట మృతదేహలను పోలీసులు గుర్తించారు. మృతులు భార్యాభర్తలుగా పోలీసులు తెలిపారు. వీరి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

విశాఖపట్టణం:ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని యలమంచిలిలో వ్యవసాయబావిలో జంట మృతదేహలు కలకలం రేపుతున్నాయి.  యలమంచిలి రైల్వే బ్రిడ్జి సమీపంలో ఉన్న జంట మృతదేహలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహలు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాయి. రెండు రోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

వ్యవసాయబావికి సమీపంలోనే స్కూటీని పోలీసులు గుర్తించారు.  బావిలో ఉన్న మృతదేహలను పోలీసులు గుర్తించారు. జిల్లాలోని త్రిపురవానిపాలెం గ్రామానికి చెందిన  శ్రీను, చిన్నారి దంపతులుగా గుర్తించారు. వీరికి 18 ఏళ్ల క్రితం వివాహహైంది. 

నాలుగు రోజుల క్రితం వీరిద్దరూ నర్సింగ్ పల్లికి వచ్చారు ఇంటికి తిరిగి వెళ్తున్నామని బంధువులకు చెప్పి వెళ్లారు. అయితే ఇంటికి వెళ్లలేదు. వ్యవసాయబావిలో వీరి మృతదేహలు బయటపడడం కలకలం రేపుతుంది. వీరిద్దరి అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజమండ్రిలోని వీఎల్ పురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్ధిక ఇబ్బందులు, పని ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అతను పేర్కొన్నారు. ఆత్మహత్యకు ముందు అతను సూసైడ్ లేఖను రాశాడు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఈ నెల 19వ తేదీన చోటు చేసుకుంది. రాజమండ్రికి చెందిన సత్యేంద్రకుమార్ రాజమండ్రికి సమీపంలోని చేపల చెరువు వద్దకు  ఇద్దరు కూతుళ్తతో కలిసి వచ్చాడు. తొలుత కూతుళ్లను చెరువులో తోసి ఆ తర్వాత అతను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

మంచిర్యాల జిల్లాలో ఇద్దరు పిల్లలను చంపి వివాహిత ఆత్మహత్య చేసుకుంది.. తన ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపిన తర్వాత వివాహిత ధనలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 18వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?