
ఎన్టీఆర్ జిల్లా (ntr district) విజయవాడలో (vijayawada) దారుణం జరిగింది. స్థానిక ప్రకాష్ నగర్‌లో మద్యం మత్తులో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కత్తితో భర్తపై దాడి చేసింది భార్య (wife attacked on husband) . ఈ ఘటనలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే భర్తపై కత్తితో దాడి అనంతరం తనను తాను గాయపరచుకుంది భార్య. దీంతో ఆమెను 108లో ఆస్పత్రికి తరలించారు పోలీసులు అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.