కుటుంబ కలహాల నేపథ్యంలో రిటైర్డ్ కానిస్టేబుల్‌పై దాడి.. పల్నాడులో ఘటన

Published : May 07, 2022, 07:21 PM IST
కుటుంబ కలహాల నేపథ్యంలో రిటైర్డ్ కానిస్టేబుల్‌పై దాడి.. పల్నాడులో ఘటన

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ రిటైర్డ్ కానిస్టేబుల్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం అచ్చంపేట పట్టణంలో రిటైర్డ్ కానిస్టేబుల్ హసన్‌పై దాడి జరిగింది.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రిటైర్డ్ కానిస్టేబుల్‌పై దాడి చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం అచ్చంపేట పట్టణంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్ కానిస్టేబుల్ హసన్‌, ఆయన కుమారుడిపై కర్రలతో దాడి జరిగింది. అచ్చంపేట పోలీసు స్టేషన్‌లో ఇరువురిపై కేసులు ఉన్నాయి. ఈ కేసులు నడుస్తున్న నేపథ్యంలో దౌర్జన్యంగా నిందితులు రిటైర్డ్ కానిస్టేబుల్ హసన్ ఇంటిలోకి చొరబడ్డారు. రాడ్లు, కర్రలతో వారిపై దాడికి దిగారు. ఇరువురిని చితకబాదారు. అనంతరం వారిని సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, మెరుగైన వైద్యం కోసం వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా బాధితులకు వైద్యులు సూచించినట్టు సమాచారం.

Jeedimetla పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ లో ఈ ఏడాది మార్చిలో దారుణం చోటు చేసుకుంది. family disputeతో బావ మీద ఇద్దరు బావమరుదులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తమ sisterను harrassment చేస్తున్నాడని కోపంతో బావ వెంకటేష్(28) మీద ఇద్దరు బావమరుదులు కత్తులతో దాడికి దిగారు. దీంతో అడ్డుగా వచ్చిన పోతురాజు (30) కత్తిపోట్లకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేష్ కడుపులో తీవ్రగాయాలు కాకవడంతో కుటుం సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఫిబ్రవరి 3న జగిత్యాలలో జరిగింది. తెల్లారితే వివాహం జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. బావమరిదిపై బావ గొడ్డలితో దాడి చేసి, ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన jagityal మండలం అంబర్పేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పొలాస గ్రామానికి చెందిన పౌలస్తేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వీర్లశంకర్ (48),  ఆయన చెల్లెలు జమునను  అంబారుపేట వాసి ఆది వెంకటేష్ కి ఇచ్చి  వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు ప్రవళిక,  పూజిత.

కొన్నాళ్ళకు వెంకటేష్ మరో వివాహం చేసుకుని గ్రామంలోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు. వెంకటేశ్ వ్యవసాయ భూమి మొదటి భార్య పేరిట ఉంది. అందులో కొంత భూమిని ఇటీవల వీర్లశంకర్ విక్రయించాడు. ఆ సొమ్ముతో వెంకటేష్ పెద్ద కుమార్తె పెళ్లి జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తన భూమిని అమ్మేశాడు అన్న కోపంతో బావమరిది శంకర్ పై వెంకటేష్ కక్ష పెంచుకున్నాడు.  

గురువారం పెద్ద కుమార్తె ప్రవళిక marriage జరగాల్సి ఉంది. పెళ్లి పందిరికి అవసరమైన దుంపిడిగింజను కొట్టి తెస్తుండగా వెంకటేష్ వచ్చి శంకర్ తో గొడవకు దిగాడు. కోపం పట్టలేక axeతో దాడి చేసి తీవ్రంగా గాయపడిన శంకర్ ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందాడు. సంఘటనలో అడ్డు వెళ్లిన శంకర్ తల్లి గంగుకు గాయాలయ్యాయి.  పట్టణ సీఐ కిషోర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?