పోస్టల్ బ్యాలెట్లు ఎందుకు చెల్లలేదు ?

First Published Aug 28, 2017, 8:51 AM IST
Highlights
  • మొత్తం పోస్టల్ బ్యాలెట్లలో కనీసం కొన్నైనా ప్రభుత్వానికి అనుకూలంగానో లేక వ్యతిరేకంగానో పడటం అందరికీ తెలిసిందే.
  • అయితే, యావత్ దేశాన్ని పట్టి ఊపేసిన నంద్యాల ఉపఎన్నికలో మాత్రం మొత్తం 250 పోస్టల్ బ్యాలెట్లు చెల్లలేదంటే దేనికి సంకేతం?
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేయలేక అలాగని ప్రధాన ప్రతిపక్షం వైసీపీకీ వేయలేక ఓటర్లు తమ హక్కును చెల్లకుండా చేసుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అన్నీ పోస్టల్ బ్యాలెట్లన్నీ చెల్లకుండా పోవటం విచిత్రంగా ఉంది. గతంలో ఏ ఎన్నికలోనూ ఈ విధంగా జరగిన దాఖల్లాలేవు. మొత్తం పోస్టల్ బ్యాలెట్లలో కనీసం కొన్నైనా ప్రభుత్వానికి అనుకూలంగానో లేక వ్యతిరేకంగానో పడటం అందరికీ తెలిసిందే. అయితే, యావత్ దేశాన్ని పట్టి ఊపేసిన నంద్యాల ఉపఎన్నికలో మాత్రం మొత్తం 250 పోస్టల్ బ్యాలెట్లు చెల్లలేదంటే దేనికి సంకేతం? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేయలేక అలాగని ప్రధాన ప్రతిపక్షం వైసీపీకీ వేయలేక ఓటర్లు తమ హక్కును చెల్లకుండా చేసుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే, ఇతర ఓట్ల లాగే పోస్టల్ ఓట్లు కూడా ఎవరికి ఎవరికి పడ్డాయో చెప్పలేకపోవచ్చు కానీ పోస్టల్ బ్యాలెట్లు ఎక్కడి నుండి వచ్చాయో, ఎవరు వేసారో అని మాత్రం తెలిసిపోతుంది. దాంతో ఓటు వేసిన వారు ఎవరికి తమ ఓటు వేసి ఉంటారన్న విషయాన్ని ఊహించే అవకాశాలున్నాయి. అసలే, ఎన్నిక సందర్భంగా అధికారపార్టీ పలువురిపై దాడులు చేసింది. భౌతికంగా దాడులు చేయటమే కాకుండా వైసీపీ నేతల ఇళ్ళపైన పోలీసులతో దాడులు కూడా చేయించింది.

అంతేకాకుండా ఓటింగ్ తర్వాత కూడా పలువురిపై టిడిపి నేతలు దాడులు చేసి గాయపరిచన ఘటనలు అనేకం జరిగాయి. ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయాల్సిన వారు ముందుగానే ఊహించారా అన్న అనుమానాలు కలుగున్నాయి. అందుకనే మొత్తం చెల్లుబాటు కాకుండా చేసారనే వాదనలు తెరపైకి వచ్చాయి.

click me!