కాకినాడలో టిడిపికి ‘ముద్రగడ’ టెన్షన్

Published : Aug 28, 2017, 07:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
కాకినాడలో టిడిపికి ‘ముద్రగడ’ టెన్షన్

సారాంశం

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపికి ముద్రగడ టెన్షన్ పట్టుకుంది.  సరిగ్గా పోలింగ్ కు రెండు రోజుల ముందు ముద్రగడ మెరుపు పాదయాత్రను మొదలుపెట్టేయటం, పోలీసులు అప్రమత్తమై అరెస్టు చేసిన ప్రభావం ఎన్నికపై పడటం ఖాయమన్న అన్న టెన్షన్ టిడిపిలో మొదలైంది. ఆడా, మాగ, చిన్నా, పెద్దా తేడా లేకుండా ముద్రగడతో పాదయాత్రలో పాల్గొన్నారు.  

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపికి ముద్రగడ టెన్షన్ పట్టుకుంది.  సరిగ్గా పోలింగ్ కు రెండు రోజుల ముందు ముద్రగడ మెరుపు పాదయాత్రను మొదలుపెట్టేయటం, పోలీసులు అప్రమత్తమై అరెస్టు చేసిన ప్రభావం ఎన్నికపై పడటం ఖాయమన్న అన్న టెన్షన్ టిడిపిలో మొదలైంది. కాపులను బిసిల్లో కలపాలన్న డిమాండ్ తో ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమాలతో కాపులు ఏకమవుతున్నారు.

ముద్రగడ ఆందోళనలను ప్రభుత్వం అణిచివేస్తుండటంతో కాపుల్లో అత్యధికులు చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై మండిపడుతున్న సంగతి తెలిసిందే కదా?

కాపుల ఉద్యమం తారస్ధాయికి చేరుకుంటున్న సమయంలోనే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలొచ్చాయి. మామూలుగా అయితే చంద్రబాబు ఎన్నికలను నిర్వహించేవారు కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, కోర్టు క్రియాశీలంగా వ్యవహరించటంతో ప్రభుత్వానికి ఇష్టం లేకుండానే ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. దానికితోడు అప్పటికే రాష్ట్రాన్ని నంద్యాల ఉపఎన్నిక ఫీవర్ ఊపేస్తుండటంతో టిడిపికి కష్టాలు మొదలయ్యాయి.

ఇటువంటి నేపధ్యంలోనే ముద్రగడ పలుమార్లు పాదయాత్రకు పూనుకోవటం ప్రభుత్వం అడ్డుకోవటం అందరూ చూస్తున్నదే. ఒకరకంగా ప్రభుత్వం ముద్రగడను నెలల తరబడి హౌస్ అరెస్టు చేసిందనే చెప్పాలి. ఇటువంటి సమయంలోనే ఆదివారం కాపు నేతలు, మద్దతుదారుల మధ్య ముద్రగడ పోలీసు వలయాన్ని ఛేదించుకుని కిర్లంపూడి నుండి రాజుపాలెం మీదుగా కాకినాడకు పాదయాత్రను మొదలుపెట్టేసారు. దాంతో ప్రభుత్వానికి షాక్ కొట్టినట్లైంది.

ముద్రగడ పాదయాత్ర మొదలుపెట్టేసిన విషయం టివిల ద్వారా చూసిన కాపులు వేలాదిమంది ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చేసారు. ఆడా, మాగ, చిన్నా, పెద్దా తేడా లేకుండా ముద్రగడతో పాదయాత్రలో పాల్గొన్నారు. ముద్రగడను పోలీసులు అడ్డుకోకుండా కాపు నేతలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రక్షణవలయంగా నిలబడటం ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరిచింది.

సరే, మొత్తానికి సాయంత్రం ముద్రగడను పోలసులు మళ్ళీ అరెస్టు చేసారనుకోండి అది వేరే సంగతి. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికకు ముందు జరగటంతో కాపులు అధికారపార్టీకి ఎక్కడ వ్యతిరకేకంగా మూకుమ్మడిగా ఓట్లేస్తారో అన్న భయం టిడిపిలో మొదలైంది.  

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu