
పోస్టల్ బ్యాలెట్లలో ఒక్కటీ చెల్లలేదు. రెండు నెలలుగా యావత్ దేశాన్ని ఎంతో ఉత్కంఠకు గురిచేసిన నంద్యాల ఉపఎన్నిక ఓట్ల కౌటింగ్ సోమవారం ఉదయం మొదలైంది. ఓట్ల లెక్కింపును మొదటగా పోస్టల్ బ్యాలెట్లతో లెక్కించారు. ఓట్ల లెక్కింపుకు అధికారులు 14 టేబుళ్ళుగా 19 రౌండ్లలో లెక్కింపు చేపడుతున్నారు. కౌటింగ్లో కూడా ముందు నంద్యాల రూరల్ మండలం తర్వాత పట్టణం ఓట్లు లెక్కిస్తారు. చివరగా గోస్పాడు మండలం ఓట్లను లెక్కించాలని అధికారులు నిర్ణయించారు. 250 పోస్టల్ బ్యాలెట్లలో ఒక్కటి కూడా చెల్లకుండా పోవటం విచిత్రంగా ఉంది. మామూలుగా ఎవరికీ ఓటు వేయటం ఇష్టం లేకపోతే కనీసం ‘నోటా’ ఆప్షన్ అన్నా ఎంచుకుంటారు ఓటర్లు. కానీ నంద్యాలలో మాత్రం పోస్టల్ బ్యాలెట్లన్నీ చెల్లకుండా పోవటం ఆశ్చర్యంగా ఉంది. ఇక, రూరల్, గోస్పాడు మండలాల్లో అత్యధికంగా 89 శాతం, 90 శాతం ఓట్లు పోలైన సంగతి అందరూ చూసిందే.