జగన్ పై చంద్రబాబుకు ఎందుకంత కసి ?

First Published Sep 12, 2017, 7:36 AM IST
Highlights
  • ‘‘వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్ధితి అస్సలేమీ బాగోలేదు...మతిస్ధిమితం కోల్పోయారు...ఆయనకు రాజకీయాల్లో కొనసాగే అర్హతలేదు’’ .....ఇది చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు.
  • చంద్రబాబుకు అనుభవం ఉన్న మాట నిజమే. చంద్రబాబు గురించి జగన్ అన్న మాటలు కుడా తప్పే. కానీ అంత అనుభవం ఉన్న చంద్రబాబు మాట్లాడుతున్నదేంటి?
  • జగన్ను ఏనాడైనా ప్రధాన ప్రతిపక్ష నేతగా చూసారు. ఆ మర్యాద ఎప్పుడైనా ఇచ్చారా?
  • అసెంబ్లీలోపలా, బయటా జగన్ గురించి చంద్రబాబుతో సహా మంత్రులు చేసిన వ్యాఖ్యలేంటి?
  • ఎన్నిసార్లు జగన్ను నరహంతకుడన్లేదు? వైసీపీ ఎంఎల్ఏలను చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి లాక్కోవటంతో కదూ మొదలైంది అసలు సమస్య.

‘‘వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్ధితి అస్సలేమీ బాగోలేదు...మతిస్ధిమితం కోల్పోయారు...ఆయనకు రాజకీయాల్లో కొనసాగే అర్హతలేదు’’ .....ఇది చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. శ్రీకాకుళంలో సోమవారం ప్రారంభమైన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, ప్రదాన ప్రతిపక్ష నేత గురించి చంద్రబాబు పై వ్యాఖ్యలు చేసారు. వైసీపీ తాత్కాలిక పార్టీ, అది ఎన్నో రోజులు ఉండదన్నారు. అందులో ఉండేవారంతా రౌడీలు, జేబుదొంగలట.

ఇంకా చాలా మాట్లాడారు జగన, వైసీపీ గురించి. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా తనను ఉరితీయాలని,  తన బట్టలూడదీస్తానని అసలు తానేం తప్పు చేసానంటూ అమయాకంగా ప్రశ్నించారు చంద్రబాబు. ఎంతో అనుభవం ఉన్న తనను ఎంతో రెచ్చగొట్టారంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు అనుభవం ఉన్న మాట నిజమే. చంద్రబాబు గురించి జగన్ అన్న మాటలు కుడా తప్పే. కానీ అంత అనుభవం ఉన్న చంద్రబాబు మాట్లాడుతున్నదేంటి?

జగన్ను ఏనాడైనా ప్రధాన ప్రతిపక్ష నేతగా చూసారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు తర్వాత జగనే ఉండాలి. ఆ మర్యాద ఎప్పుడైనా ఇచ్చారా? అసెంబ్లీలోపలా, బయటా జగన్ గురించి చంద్రబాబుతో సహా మంత్రులు చేసిన వ్యాఖ్యలేంటి? ఎన్నిసార్లు జగన్ను నరహంతకుడన్లేదు? వైసీపీ ఎంఎల్ఏలను చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి లాక్కోవటంతో కదూ మొదలైంది అసలు సమస్య. అసెంబ్లీలో జగన్ను మంత్రులు ఏ స్ధాయిలో రెచ్చగొట్టింది అందరూ చూసిందే కదా? అధికారంలో ఉన్నపుడు ఎక్కువ సంయమనం పాటించాల్సింది చంద్రబాబు, మంత్రులే.

జగన్ను చూడగానే బహుశా చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డే గుర్తుకువస్తున్నారేమో. వైఎస్ బ్రతికుండగా ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు ఆ కసిని ఇపుడు జగన్ పై తీర్చుకుంటున్నట్లు కనబడుతోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు ఏ విషయంలోనూ నోరెత్తలేకపోయేవారు. దాంతో చంద్రబాబులో వైఎస్ పై కసిపెరిగిపోయింది. అయితే, ఒక్కసారిగా వైఎస్ మరణించటం తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ  తెలిసిందే.

2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే, జగన్ ప్రధాన ప్రతిపక్ష నేతయ్యారు. అందుకే వైఎస్ పై తనలో పేరుకుపోయిన కసిని జగన్ పై చూపుతున్నారు. ఎదుటి వాళ్ళు తనకు మర్యాద ఇవ్వాలని అనుకున్నపుడు ముందు తాను ఎదుటి వాళ్ళకు మర్యాద ఇస్తే వాళ్ళు కుడా అదే మర్యాద ఇస్తారని 40 ఇయర్స్ చంద్రబాబుకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

 

 

click me!