ముఖ్యమంత్రికి ఒక రాయలసీమ రైతు బహిరంగ లేఖ

Published : Sep 11, 2017, 06:06 PM ISTUpdated : Mar 24, 2018, 12:09 PM IST
ముఖ్యమంత్రికి ఒక రాయలసీమ రైతు బహిరంగ లేఖ

సారాంశం

మాకేవీ ఉచితం వద్దు ఉచిత కరెంటు తీసేయండి రుణమాఫీ ఎత్తేయండి ఎమ్మెల్యేల జీతం ఎలా పెంచారో అదే శాతంలో మా పంటకు గిట్టుబాటు ధరపెంచండి చాలు

 

ముఖ్యమంత్రి గారూ...

 

రైతులకు ఎరువులు ఉచితం

వ్యవసాయానికి కరెంటు ఉచితం

రుణ మాఫీ

విత్తనాలు సబ్సిడీ

ఈ ప్రభుత్వంలో రైతులకు అన్నీ ఫ్రీ

వీరికి ఇంకేం కావాలి , అని ప్రజల ఆలోచన

70%  వ్యవసాయం పై ఆధార పడ్డవారే , కాని వీరికి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి,

 అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని ప్రభుత్వ ఆలోచన

 కానీ నేను ఒక రైతు బిడ్డగా చెబుతున్నా ,

మా రైతులకు ఏది ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ గా ఇవ్వాల్సిన అవసరం లేదు అని విన్నవిస్తున్నా,

 ఎందుకంటే ,

 అంగన్ వాడి కార్యకర్తలను టీచర్లుగా ఎలా గుర్తించి 4,000 జీతం నుండి 10,000 జీతంగా పెంచావో,

1,500 జీతం ఉన్న సర్పంచ్ జీతం 5,000 చేసావో ,

75,000 జీతం ఉన్న ఎమ్మెల్యే జీతం 1,50,000 చేసావో ,

విపరీతంగా పెంచిన గవర్నమెంటు ఉద్యోగుల జీతాలను ఏ విధంగా పెంచావో ,

అదే విధంగా , అదే శాతంతో సమానంగా రైతు పండించిన పంటకు ధరను నిర్ణయించి , ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలి.

ఎందుకు కొనుగోలు చెయ్యరు, ప్రశ్నిద్దాం, పోరాడుదాం

 లక్ష రూపాయల జీతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రోగం వస్తే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఫ్రీ , అతని పిల్లలకి ఫ్రీ , అతని భార్యకు ఫ్రీ మరియు అతని తల్లిదండ్రులకు కూడా ఫ్రీ

వారికి ఆఫీస్ టైం ఉ. 9 to మధ్యాహ్నం తర్వాత 4:30 వరకే , కచ్చితంగా టైంకొస్తారు టైంకు పోతారు.

మరి రైతు లేనిదే రాజ్యం లేదు , రైతే రాజు , రైతు లేకుండా జీవించలేము ,జై జవాన్ జై కిసాన్ , రైతు ఏడ్చిన రాజ్యం లేదు , ఎద్దు ఏడ్చిన ఎవుసం లేదు అని చెపుతున్న రాజకీయ నాయకుల్లారా ,

రాత్రనక , పగలనక , ఏ టైం లేకుండా , ఎప్పుడు పడితే అప్పుడు పొలానికి వెళ్లిన రైతు , తిరిగి వస్తాడో , లేదో తెలియక , ఇంటి దగ్గర ఎదురు చూసే భార్య , పిల్లలు , పంటకు రోగం , మనిషికి రోగం వస్తే ఎక్కడ చూపియ్య లో తెలియక , అప్పు చేసి , దిగుబడి తగ్గి కుంగిపోయే రైతులకు ఇస్తే ఫ్రీ అంటారు, ఉద్యోగులకు ఇస్తే ఇంక్రిమెంట్ అంటారు....

ఇట్లు 

ఒక రాయలసీమ రైతు బిడ్డ

 

PREV
click me!

Recommended Stories

Ap Deputy CM Pawan Kalyan: అమ్మ పుట్టినరోజున పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Visit Visakhapatnam Zoo | IndiraGandhi Zoological Park| Asianet News Telugu