అచ్చెన్నకు ఎందుకు అంతమంట?

Published : May 12, 2017, 07:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
అచ్చెన్నకు ఎందుకు అంతమంట?

సారాంశం

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరి మద్దతు తీసుకోవాలన్నది పూర్తిగా మోడి ఇష్టం. అటువంటిది అచ్చెన్నకు వచ్చిన ఇబ్బందేమిటో? మద్దతు తీసుకుంటున్న భాజపా బాగానే ఉంది. టిడిపి మాత్రం వైసీపీపై ఎగిరెగిరి పడుతోంది.

మంత్రి అచ్చెన్నాయడు భలే కామిడీ చేస్తున్నారు. ‘రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు తమకు అవసరం లేద’ని చెప్పటం విచిత్రంగా ఉంది. రాష్ట్రపతి అభ్యర్ది అంటే అదేదో టిడిపి పాలిట్ బ్యూరో సభ్యత్వం అనుకుంటున్నారేమో. రాష్ట్రపతి అభ్యర్దిని ఎంపిక చేయటమన్నది భాజపా,  నరేంద్రమోడి ఇష్టం. ఏదో తప్పదు కాబట్టి ఆమధ్య రాష్ట్రపతి అభ్యర్ధిపై మోడి ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసారు. అయితే, అప్పటి సమావేశంలో అసలు రాష్ట్రపతి అభ్యర్ధి అంశమే చర్చకు రాలేదని చంద్రబాబునాయుడే స్వయంగా చెప్పారు.

అంటే అర్ధం ఏమిటి? ఎన్డీఏ పక్షాలతో కూడా అభ్యర్ధి విషయాన్ని మోడి చర్చించలేదనే అనుకోవాలి. రాష్ట్రపతి అభ్యర్ధిని పోటీలో పెట్టి గెలిపించుకోవాలంటే ఎన్డీఏకి సుమారు 20 వేల ఎలక్టోరల్ ఓట్లు అవసరం. అందుకే మద్దతు ఇస్తారని అనుకున్న అన్నీ ప్రాంతీయ పార్టీలతోనూ మోడి మాట్లాడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రధాని జగన్ తో మాట్లాడాలని అనుకుని ఉంటారు. దాంతో ప్రధాని కార్యాలయం పిలుపుమేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధానితో భేటీ అయ్యారు.

సరే, భేటీ అన్నా అనేక విషయాలపై మాట్లాడుకుంటారు కదా? అయితే, తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి తాము మద్దతు ఇస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అప్పటి నుండి టిడిపి మండిపోతోంది. తాజాగా అచ్చెన్న మాటల్లో కూడా అదే కనబడుతోంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరి మద్దతు తీసుకోవాలన్నది పూర్తిగా మోడి ఇష్టం. అటువంటిది అచ్చెన్నకు వచ్చిన ఇబ్బందేమిటో? మద్దతు తీసుకుంటున్న భాజపా బాగానే ఉంది. టిడిపి మాత్రం వైసీపీపై ఎగిరెగిరి పడుతోంది. అదే సమయంలో చంద్రబాబును అరెస్టు చేస్తారన్న భయం తమకు లేదని కూడా అన్నారు. అంటే చంద్రబాబు అరెస్టయ్యే అవకాశం ఉందని టిడిపి అనుమానిస్తోందా? అనుమానం లేకపోతే చంద్రబాబు అరెస్టుపై తమకు భయం లేదని అచ్చెన్న ఎందుకంటారు?

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే