ఆ మాత్రానికి దావోస్ వెళ్లాలా?

Published : Jan 17, 2017, 06:51 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఆ మాత్రానికి దావోస్ వెళ్లాలా?

సారాంశం

 దావోస్ ప్రపంచ  ఆర్థిక సదస్సుకు వచ్చిన ఇన్వెస్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపన్యాసం అవసరం లేదా?

 

దావోస్ జనవరి 17 నుంచి 20 వతేదీ వరకు జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు సమావేశంలో పాల్గొనాలని ఆమధ్య ఆహ్వానం వచ్చింది. అప్పటినుంచి ఆంధ్రలో పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే,  ప్రపంచంలోని మేటి పారిశ్రామిక వేత్తలంతా పాల్గొనే ఈ సదస్సుకు ఇండియానుంచి ఆహ్వానం అందుకున్న ఒకే ‘ఒఖ్ఖడు’చంద్రబాబు.  అది గర్వకారణం.

 

ఈ మధ్య ప్రపంచ దేశాలు తిరిగిన అనుభవం, వరల్డ్ క్లాస్ క్యాపిటల్అమరావతి కడుతున్న అనుభవం, ఫైబర్ నెట్,  డిమానెటైజేషన్ సలహాలు, ఆంధ్రప్రదేశ్ ను ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్ చేస్తున్న వ్యూహం... ఇలా సవాలక్ష మైలురాళ్లు సృష్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దావోస్ కు వరుసగా మూడో సారి పిలవడమంటే పండగే.. అనుమానం లేదు.

 

అయితే ఈ మూడురోజుల పాటు జరిగే దావోస్ సదస్సులో దాదాపు 250 మంది వక్తలు మాట్లాడుతున్నారు. వీరిలో స్టేట్ బ్యాంక్ ఛెయిర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఎన్ డిటివి అధినేత ప్రణయ్ రాయ్, జర్నలిస్టు విక్రమ్ చంద్, అంబానీ తదితరులున్నారు.

 

అయితే, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరు  A to Z  స్పీకర్ ల జాబితాలో   ఎక్కడా లేదు.  అంటే ఆయనకూ ఒక ఆహ్వానం పంపించేశారు తప్ప ప్రపంగించేందుకు అవకాశం లేదు.  ఇవ్వకపోవడం విశేషం.  250 (దాదాపు) ఉపన్యాసకుల పేర్లలో బాబు పేరు లేకపొవడం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆహ్వానం ఏదో  పబ్లిక్ రిలేషన్స్ కంపెనీ   పంపినట్లనిపిస్తుంది తప్ప   ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉపన్యసించాలని కోరినట్లు లేదు. 

 

ఫలితంగా అక్కడ జరుగుతున్న డజన్ల కొద్ది సదస్సులలో కూర్చోవాలంటే బోరే. అందువల్ల ఆయన  అక్కడికొచ్చిన పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతున్నారు. ఇందులో కొంతమంది విదేశాలలో స్థిరపడిన తెలుగువారు. దావోస్ కు వెళ్లడానికి ముందు జ్యూరిక్ లో ఆయన స్టాడ్లర్ రైల్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. ఆచర్చలలో వాళ్లు వైజాగ్ ఒక యూనిట్ పెట్టాలనుకుంటున్నారని చెప్పారని బాబుగారి ఆఫీస్ వారు చెబుతున్నారు.

 

మన వైజాగ్ లో యూనిట్ పెట్టాలనుకోవడం మంచిదే.కాని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కలుసుకునేదాకా కంపెనీ వారు ఈ విషయం వెల్లడించకపోవడమేమిటి?

 

సాగర తీరాన ఉన్న విశాఖలో దుకాణాం తెరవాలనుకున్నవాడు,  పరుగు పెట్టుకుంటూ అమరావతి వచ్చి,  బ్బాబ్బాబు   మీవూర్లో రైలు ఇంజన్లు, బోగీలు తయారుచేసే ఫ్యాక్టరీ పెడతామని అడగాలి. వాళ్లొకసారి కూూడా అంధ్రకు వచ్చినట్లు దాఖలా లేదు. మనం చెప్పే దాకా వైజాగ్ గురించి వారికి తెలియదా. తెలియక పోతే, ఉన్నఫలానా ఫ్యాక్టీర పెట్టేస్తామని ఒప్పుకుంటారా?

 

అది కూడా ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటుచేశాక  ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన.

 

 స్టాడ్లర్ నిజంగా   వైజాగ్ ను ఎంపిక చేసుకున్నారా లేక వైజాగ్ బాగుంటుంది, అక్కడ యూనిట్  పెట్టండని ముఖ్యమంత్రి అడిగారా? ఈ రెండింటికి చాలా తేడా ఉంది. మొదటికది  స్టాడ్లర్ కంపెనీ వాళ్ల   విస్తరణ  కాంక్ష రెండోది వాళ్లొస్తే బాగుంటుందన్న ఆశ లేదా అత్యాశ.

 

ఇలా అనుమానాలకు తావిచ్చే సమావేశాలు,చర్చలుజరిపి బహుశా, జనవరి 20 తేదన సాయంకాలం ‘ బాబు దావోస్ పర్యటన విజయవంతం’ అని భారీ బాంబు  పేలుస్తారేమో చూడాలి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?